కుక్కను కరిచిన మనిషిని అరెస్ట్ చేసిన పోలీసులు..

కుక్కను కరిచిన మనిషిని అరెస్ట్ చేసిన పోలీసులు..

సమాజంలో హైలెట్ అవాలని  ప్రజలు తమ గురించి చర్చించుకోవాలని  కొంచెం భిన్నంగా ఆలోచిస్తారు. జంతువులు మనుషులు కరిచాయంటే అవి వాటి స్వభావం.  కాని మనుషులే జంతువులను కరిస్తే.. ఇక అలాంటి విషయాలు సోషల్ వైరల్ అవడమే కాదు... ఇలాంటి వ్యక్తులపై సామాజిక మాధ్యమాల్లో చర్చ కూడా జరుగుతుంది. 

 

ALSO READ :పట్ట పగలే అందరూ చూస్తుండగానే.. మాజీ కాబోయే భార్యను పొడిచి చంపిండు

పోలీస్ కుక్కను కాటేశాడు

అమెరికా లోని డెలావేర్ స్టేట్ లో ఓ వ్యక్తి పోలీస్ కుక్కను మనిషి కరిచిన ఘటన జరిగింది. జూలై 8న  జమాల్ వింగ్ (47) అనే వ్యక్తి మద్యం సేవించి కారును వేగంగా డ్రైవ్ చేస్తున్నాడు. ఆ వ్యక్తిని  వ్యక్తిని పట్టుకోవడానికి  పోలీసులు  వెంబడించారు. ఈ సమయంలో ఆ వ్యక్తి చేసిన పని ఎవరూ ఊహించలేదు. ఇంతకూ ఆయన ఏం చేశాడంటే   పోలీసు కుక్కను కరిచాడు. అతనిని కారు దిగమని అడుగుతున్నా.. వింగ్ పోలీసుల మాట వినలేదు. అయితే పోలీసు కుక్క వింగ్ కారులోపలికి వెళ్లింది. ఇక అంతే.. బాగా మద్యం సేవించి ఉండటంతో ఆయన ఏమి చేస్తున్నాడో ఆయనకే అర్దం కాలేదు. వెంటనే ఆయన పోలీస్ కుక్కను నోటితో కాటేశాడు. ఇక కుక్క కూడా అతనిని కరిచింది.  జమాల్ వింగ్ మద్యం మత్తులో కుక్కను కరిచాడని గుర్తించిన పోలీసులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించాడు. ఈ ఘటనలో DSP K9 పోలీసు కుక్క కూడా గాయపడింది.  జమాల్ వింగ్ కోలుకున్న తర్వాత ఆయనపై స్పీడ్ డ్రైవింగ్ కేసు నమోదు చేశారు.