కన్న తల్లి డెడ్ బాడీ ఇంట్లో ఉంచుకొని ఓటేసిన కొడుకు

కన్న తల్లి డెడ్ బాడీ ఇంట్లో ఉంచుకొని ఓటేసిన కొడుకు

దహెగాం, వెలుగు: కన్న తల్లి చనిపోయి పుట్టెడు దు:ఖంలోనూ కొడుకు తనవంతు బాధ్యతగా ఓటేశాడు. కుమ్రంభీం ఆసిఫాబాద్​ జిల్లా దహెగాం మండల కేంద్రానికి చెందిన కాటారాపు కమల అనారోగ్యంతో ఆదివారం ఉదయం చనిపోయింది. 

కాగా, ఆమె కొడుకు కాటారపు శ్రీనివాస్​ తల్లి చనిపోయిన బాధను దిగమింగి మండల కేంద్రంలోని పోలింగ్​ స్టేషన్​కు వచ్చి ఓటేశాడు. విషయం తెలుసుకున్న పలువురు ఆయనను అభినందించారు.