వ్యాక్సిన్ తీసుకున్నాకే నా కూతురు చనిపోయింది

వ్యాక్సిన్ తీసుకున్నాకే నా కూతురు చనిపోయింది

కరోనా టీకాతో తన కూతురు చనిపోయిందని ఓ తండ్రి ఫిర్యాదు చేశాడు. తనకు ప్రభుత్వం, టీకా తయారు చేసిన సంస్థలు వెయ్యి కోట్లు పరిహారం చెల్లించాలని కూడా డిమాండ్ చేశాడు. ఈ ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది. నాసిక్‌లో మెడిసన్ చదువుతున్న తన కూతురు స్నేహల్.. కరోనా టీకా తీసుకుందని చెప్పాడు. వ్యాక్సినేషన్ డ్రైవ్‌లో భాగంగా ఫ్రంట్ లైన్ వారియర్స్ అయిన హెల్త్ వర్కర్క్ అంతా టీకా తీసుకోవాలని మహారాష్ట్ర ప్రభుత్వం పేర్కొన్న విషయం తెలిసిందే. దీంతో మెడికల్ కాలేజీలో స్నేహల్ కోవిడ్ వ్యాక్సిన్ తీసుకుంది. 

2021, జనవరి 28వ తేదీన టీకా తీసుకున్న తర్వాత… స్నేహల్ మార్చి 01వ తేదీన చనిపోయింది. దీంతో ఆమె తండ్రి లునావత్ హైకోర్టును ఆశ్రయించాడు. కోవిషీల్డ్ టీకా దుష్ర్పభావాల కారణంగా కుమార్తె మృతి చెందిందని, తనకు న్యాయం కావాలని పిటిషన్ దాఖలు చేశాడు. ఎంతో మంది ప్రాణాలు కాపాడేందుకు తాను ఈ పిటిషన్ దాఖలు చేయడం జరుగుతోందన్నారు. వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్స్ కారణంగా ప్రాణాలు పోయిందని వాపోయాడు. తనకు న్యాయం చేయాలని కోరుతున్నాడు. 

ఇవి కూడా చదవండి: 

కాలుతున్న లారీ ఎక్కిన డ్రైవర్

10 అడుగుల దోశ.. 40 నిమిషాల్లో తినాలి