రామ భక్తి: సెలవు ఇవ్వలేదని ఉద్యోగానికి రాజీనామా

రామ భక్తి: సెలవు ఇవ్వలేదని ఉద్యోగానికి రాజీనామా

అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవం సోమవారం (జనవరి 22) అంగరంగ వైభవంగా జరిగింది. మధ్యాహ్నం 12.29 నుంచి 12.30 మధ్య శుభముహూర్తమున ప్రధాని మోదీ.. రామమందిరం గర్భగుడిలో రామ్ లల్లా ప్రాణప్రతిష్ఠ చేశారు. ఈ మహోత్సవానికి దాదాపు 11 వేల మంది ప్రముఖులు, భక్తులు, మతగురువులు, సన్యాసులు హాజరయ్యారు. ఇటువంటి రామమందిరంలో రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని కోట్లాది మంది ప్రజలు లైవ్ లోవీక్షించారు.. ఇటువంటి ఆ మధుర క్షణాలకోసం అందరూ తమ పనులను వాయిదా వేసుకొని ఎదురు చూశారు. అయితే ఓ భక్తుడు రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవానికి తిలకించేందుకు సెలవు ఇవ్వలేదని కంపెనీ యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. తన ఉద్యోగానికి రాజీనామా చేసి శ్రీరాముడిపై ఉన్న భక్తిని చాటుకున్నాడు. 

గగన్ తివారీ అనే వ్యక్తి రామజన్మభూమిలో రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ఠ రోజున సెలవు ఇవ్వలేదని జనరల్ మేనేజర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. చారిత్రాత్మకమైన రోజున సెలవు నిరాకరించడంతో అతను తన ఉద్యోగానికి రాజీనామా చేసినట్లు సోషల్ మీడియాలో షేర్ మేసేజ్ చేశారు. ఈ పోస్ట్ వైరల్ గా మారింది. 

తివారీ సెలవు తిరస్కరణపై, ఉద్యోగాన్ని విడిచిపెట్టడంపై పలువరు నెటిజన్లు స్పందించారు. రామభక్తులు తివారీ నిర్ణయాన్ని మెచ్చుకున్నారు. భగవంతుని ఆశీస్సులు అతనికి ఉంటాయి.. త్వరలో కొత్త ఉద్యోగం లభిస్తుందని రాశారు. చాలామంది నెటిజన్లు తివారినీ లెజెండ్  అని కూడా పొగిడారు.