మనసులే లేవా : ట్రాక్టర్ కింద పడేసి చంపారు.. ఇంత కసిగా.. క్రూరంగానా..!

మనసులే లేవా : ట్రాక్టర్ కింద పడేసి చంపారు.. ఇంత కసిగా.. క్రూరంగానా..!

మనిషిపై కోపం ఉండొచ్చు.. కసి ఉండొచ్చు.. చంపాలన్న పగ ఉండొచ్చు.. అలా అని పగోడు దొరికితే ఇంత కిరాతకంగా చంపుతారా.. ఇంత క్రూరంగా చంపుతారా.. రాజస్థాన్ లో పట్టపగలు.. వందల మంది చూస్తుండగా జరిగిన ఘటన తెలిస్తే.. ఈ మాటలే అంటారు అందరూ.. అంత్యంత దారుణంగా జరిగిన ఈ హత్య ఇప్పుడు సంచలనంగా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

రాజస్తాన్ రాష్ట్రం.. భరత్ పూర్ జిల్లా బయానా ప్రాంతంలో రెండు వర్గాల మధ్య.. భూమి విషయంలో గొడవ జరిగింది. కొన్ని రోజులుగా జరుగుతున్న ఈ వివాదంపై ఇప్పటికే పోలీస్ కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలోనే అక్టోబర్ 25వ తేదీ ఉదయం.. ఓ వర్గానికి చెందిన వ్యక్తులు.. వివాదాస్పదమైన భూమిలోకి వచ్చారు. ఈ విషయం తెలుసుకున్న ప్రత్యర్థులు సైతం అక్కడికి చేరుకున్నారు. రెండు వర్గాల మధ్య ఘర్షణలు జరిగాయి. ఈ క్రమంలోనే ఓ వర్గానికి చెందిన వ్యక్తి.. తన ట్రాక్టర్ తో భూమిలోకి ప్రవేశించాడు. అక్కడ ఉన్న వ్యక్తులపైకి దూసుకెళ్లాడు. ప్రత్యర్థి వర్గానికి చెందిన వ్యక్తి.. ఆ ట్రాక్టర్ కింద పడ్డాడు. దీన్ని గమనించిన మిగతా వారు అతన్ని రక్షించే ప్రయత్నం చేశారు. అయితే ట్రాక్టర్ నడుపుతున్న వ్యక్తి.. ఆ మనిషిపై నుంచే.. ట్రాక్టర్ ను ముందుకు.. వెనక్కు నడుపుతూ.. అతన్ని అత్యంత క్రూరంగా చంపేశాడు. అతని నడుములు విరిగేలా.. చనిపోయేలా ట్రాక్టర్ ను అతని పైనుంచి ముందుకు, వెనక్కి నడుపుతూ.. అందరి ముందే చంపేశాడు. 

విషయం తెలుసుకున్న పోలీసులు స్పాట్ కు వచ్చారు. ప్రమాద వశాత్తు ట్రాక్టర్ కింద పడి చనిపోయినట్లు.. అతని వర్గం సమర్థించుకున్నది. అయితే స్థానికులు కొందరు తీసిన వీడియోలను పరిశీలిస్తే.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ట్రాక్టర్ నడిపిన వ్యక్తి.. కావాలనే.. ఉద్దేశపూర్వకంగా అతన్ని ట్రాక్టర్ తో ఢీకొట్టి.. కింద పడిన తర్వాత అతని మీదుగా ట్రాక్టర్ ను నడిపినట్లు.. మొత్తం రికార్డ్ అయ్యింది. 

పోలీసులు హత్య కింద కేసులు నమోదు చేశారు. ట్రాక్టర్ నడిపిన వ్యక్తి కోసం గాలిస్తున్నారు. భరత్ పూర్ ఘటన మానవత్వానికే మచ్చ అంటూ జిల్లా ఎస్పీ ప్రకటించారు. దీనిపై ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించినట్లు ఆ రాష్ట్ర డీజీపీ తెలిపారు. ప్రస్తుతం రాజస్తాన్ లో ఎన్నికల జరుగుతుండటంతో.. ఈ ఘటన కాంగ్రెస్, బీజేపీ మధ్య వివాదంగా మారుతుంది.. 

ALSO READ :- Cricket World Cup 2023: గొప్ప పేరు, డబ్బు సంపాదించడంలో అసలైన ఆనందం దొరకదు: విరాట్ కోహ్లీ