కీసరలో డాక్టర్ల నిర్లక్ష్యం... ఇంజక్షన్లు ఇచ్చిన కొద్దిసేపటికే యువకుడు మృతి..

కీసరలో డాక్టర్ల నిర్లక్ష్యం... ఇంజక్షన్లు ఇచ్చిన కొద్దిసేపటికే యువకుడు మృతి..
  • హాస్పిటల్​ ఫర్నిచర్​ ధ్వంసం చేసిన కుటుంబ సభ్యులు

కీసర, వెలుగు: ఒంట్లో బాగాలేక హాస్పిటల్​లో అడ్మిట్​ అయిన వ్యక్తి చనిపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే మృతిచెందాడని ఆరోపిస్తూ హాస్పిటల్​లో ఫర్నిచర్​ ధ్వంసం చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా పగిడిపల్లికి చెందిన మహేశ్​యాదవ్​ ఆదివారం కీసరలో బొడ్రాయి పండుగ ఉండడంతో బంధువుల ఇంటికి వచ్చాడు. ఒంట్లో బాగలేకపోవడంతో స్థానికంగా ఉన్న నితిన్​ హాస్పిటల్​కు వెళ్లాడు. 

పరీక్షించిన డాక్టర్లు మహేశ్​కు ఇంజక్షన్లు ఇచ్చి ట్రీట్ మెంట్ చేశారు. కొద్దిసేపటి తరువాత ఆయనకు నోటిమాట రాకపోవడంతో వెంటనే అక్కడి నుంచి మరో దవాఖానకు తీసుకెళ్లాలని డాక్టర్లు చెప్పారు. కుటుంబసభ్యులు నాగారంలోని ఓ హాస్పిటల్​కు తరలిస్తుండగా మార్గమధ్యలోనే చనిపోయాడు. ఇంజక్షన్లు ఇచ్చిన అనంతరమే మహేశ్​ ఆరోగ్యం విషమంగా మారి మృతిచెందాడని ఆరోపిస్తూ నితిన్​ హాస్పిటల్​ ఎదుట ఆందోళనకు దిగారు. ఫర్నిచర్, ఏసీ ధ్వంసం చేశారు. వీరి ఆందోళనతో ట్రాఫిక్​జామ్​ ఏర్పడింది.