డెలివరీ బాయ్ కక్కుర్తి..3వేల విస్కీబాటిళ్ల దొంగతనం

డెలివరీ బాయ్ కక్కుర్తి..3వేల విస్కీబాటిళ్ల దొంగతనం

కాసులకు కక్కుర్తిపడ్డ ఓ డెలివరీ బాయ్ 3వేల విస్కీ బాటిళ్లను దొంగతనం చేసి అమ్మేందుకు ప్రయత్నించాడు.

ఇంగ్లాండ్ లోని కమర్షియల్ ప్రాంతమైన క్రిక్ డెలే లో ఓ విస్కీ బాటిళ్లను భద్రపరిచే గూడౌన్ నుంచి సుమారు 3వేల విస్కీ బాటిళ్లను దొంగతనం చేసేందుకు ఓ డెలివరీ బాయ్ ప్రయత్నంచాడు.

ఈ చోరీకి ముందు 10రోజుల పాటు రెక్కీ నిర్వహించాడు. అందరికి తాను బిజినెస్ మ్యాన్ అని పరిచయం చేసుకొని ఎక్కడ, ఏ షాప్ లో విలువైన వస్తువులు ఉన్నాయో ఆరా తీశాడు.

స్థానికంగా ఉండే ఎంసీ బర్నీ అనే ట్రాన్స్ పోర్ట్ సంస్థ గూడౌన్ నుంచి విస్కీ బాటిళ్లను సరఫరా చేస్తుంది. ఆ గూడౌన్ నుంచి విస్కీ బాటిళ్లను తస్కరించేలా ప్లాన్ చేశాడు. విలువైన విస్కీ బాటిళ్లను కొట్టేసేందుకు వీలుగా గూడౌన్ సమీపంలో ఉన్న ఓ వాహనాన్ని దొంగిలించాడు. అక్కడి నుంచి దొంగిలించిన వాహనంలోకి విస్కీ బాటిళ్లను లోడ్ చేసి దొంగిలించాడు. క్రిక్ డెలే ప్రాంతం నుంచి మరోప్రాంతానికి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు సదరు డెలివరీ బాయ్ వాలకంపై అనుమానం వచ్చింది. వాహనం ఎక్కడి నుంచి వచ్చింది..? ఏ ప్రాంతం నుంచి వచ్చింది అని సీసీ కెమెరాలను పరిశీలించారు. దీంతో డెలివరిబాయ్ దొంగతనం వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దొంగ కోసం గాలింపు చర్యలు చేపట్టి ఎట్టకేలకు పట్టుకున్నారు.