ఈ చైనా వాళ్ల దుంపతెగ : ఐస్ క్రీంను బాతు గుడ్లతో తింటున్నారు..

ఈ చైనా వాళ్ల దుంపతెగ : ఐస్ క్రీంను బాతు గుడ్లతో తింటున్నారు..

ఐస్ క్రీం అంటే ఇష్టపడని వారు ఎవరుంటారు.. అప్పట్లో ఐస్ క్రీంను ఐస్ క్రీంగా తినేవారు.. ఇప్పుడు మాత్రం కాంబినేషన్స్ వచ్చేశాయి.. ఐస్ క్రీం విత్ గులాబ్ జాం.. ఐస్ క్రీం విత్ స్వీట్స్ తో తింటున్నారు.. ఇప్పుడు కొత్త ట్రెండ్ వచ్చింది.. ఐస్ క్రీంను బాతుగుడ్లతో కలిపి తింటున్నారు.. కోడిగుడ్లు అయితే ఓ రకంగా ఫీలయ్యేవారేమో కానీ.. బాతుగుడ్లతో ఐస్ క్రీం అనేసరికి నెటిజన్లు సైతం భిన్నంగా స్పందిస్తు్న్నారు.. ఈ కొత్త రకం డెజర్ట్ ను సింగపూర్‌కు చెందిన కాల్విన్ లీ అనే ఇన్‌ఫ్లుయెన్సర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అది చూసి వారు అబ్బో అదేం కాంబినేషన్ రా బాబు అనుకుంటుంటే.. తిన్న కాల్విన్ మాత్రం వావ్ సూపర్ అన్నాడు. దానికి సాల్టెడ్ ఎగ్ ఐస్ క్రీం అని పేరు పెట్టాడు.

ఉప్పు నీటిలో ఉడికించిన బాతు గుడ్లలో ఐస్ క్రీం వేసి బాగా మిక్స్ చేసి ఎల్లో ఎగ్ పొడిని దాంతో కలుపుకున్నాడు. కాల్విన్ ఎప్పుడు సోషల్ మీడియాలో ఇలాంటి ప్రయోగాలే చేస్తుంటాడు. సాల్టెడ్ ఎగ్ ఫ్లేవర్‌ సూపర్ టేస్టీగా ఉందని కాల్విన్ లీ అన్నాడు. స్వీట్ అండ్ సాల్టీగా మంచి రుచిగా ఉందని, మీరు కూడా ట్రై చేయాలని వ్యూవర్స్ ను కోరాడు. ఈ వీడియో ఇంటర్నెట్ లో వైరల్ అయ్యింది. చూసిన జనాలు నానారకాలుగా కామెంట్ చేస్తున్నారు.