
రంగారెడ్డి, హైదరాబాద్ లో కురుస్తున్న వర్షాలకు మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఒక వ్యక్తి మూసీ నదిలో పడి గల్లంతవ్వడం కలకలం రేపింది. గురువారం (ఆగస్టు 28) సాయంత్రం మూసీనదిలో పడిపోవడంతో ప్రమాదం చోటుచేసుకుంది.
చాదర్‌ఘాట్ శంకర్‌నగర్ దగ్గర జరిగింది ఈ ఘటన. సలీం అనే వ్యక్తి ప్రమాదవశాత్తు మూసీ నదిలో పడిపోవటం కలకలం రేపింది. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. గల్లంతైన సలీం కోసం హైడ్రా, SDRF బృందాలు గాలిస్తున్నాయి.
ఘటనా స్థలానికి స్థానికులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. కుటుంబ సభ్యులు ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటి వరకు వ్యక్తి ఆచూకీ దొరకలేదు. రాత్రి సమీపిస్తుండటంతో గాలింపు చర్యలకు ఇబ్బంది కలిగే అవకాశం ఉంది.
►ALSO READ | మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల పరిహారం ఇవ్వాలె: మాజీ మంత్రి కేటీఆర్