
కంటోన్మెంట్, వెలుగు: డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లోభాగంగా బ్రీత్ఎనలైజర్ మెషిన్ తో పారిపోయిన మందుబాబు ఎట్టకేలకు చిక్కాడు. బోయిన్పల్లి పోలీసులు తెలిపిన ప్రకారం.. పెద్దపల్లి జిల్లా రామగుండం ప్రాంతానికి చెందిన కొత్తపల్లి శ్రావణ్గత నెల 27న తన స్విఫ్ట్డిజైర్కారులో సాయంత్రం 5 గంటల సమయంలో బోయిన్పల్లి వైపు వెళ్తున్నాడు. అదే సమయంలో బోయిన్పల్లి ట్రాఫిక్ పోలీసులు న్యూ బోయిన్పల్లి పుల్లారెడ్డి బిల్డింగ్ వద్ద డ్రంకెన్ డ్రైవ్ చెకింగ్ లు చేస్తున్నారు. స్విఫ్ట్డిజైర్కారు రాగా ఆపిన పోలీసులు బ్రీత్ఎనలైజర్మెషిన్ శ్రావణ్నోట్లో పెట్టారు. అతడు గాలి ఊదుతున్నట్లు నటించి మెషిన్ పట్టుకుని కారులో ఉడాయించాడు. దీంతో పోలీసులు అతడిని పట్టుకునేందుకు చేజ్చేసినా దొరకలేదు. బోయిన్పల్లి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. విచారణలో భాగంగా సీసీ కెమెరాల ఫుటేజ్ లను పరిశీలించి శ్రావణ్ అడ్రస్ తెలుసుకుని అదుపులోకి తీసుకుని డ్రంకెన్ డ్రైవ్ కేసు నమోదు చేశారు.