బిడ్డను బకెట్ నీళ్లలో ముంచి.. రాడ్‌తో భార్య తలపై కొట్టి చంపాడు : కిరాతకుడు

బిడ్డను బకెట్ నీళ్లలో ముంచి.. రాడ్‌తో భార్య తలపై కొట్టి చంపాడు : కిరాతకుడు
  • ఇనుప రాడ్డుతో  భార్య తలపై మోది హత్య
  • కొడుకును వాటర్ బకెట్ లో ముంచి ఊపిరాడకుండా చేసి
  • సనత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన

హైదరాబాద్:కుటుంబ కలహాలతో భార్య, కొడుకును హత్య చేశాడో కసాయి తండ్రి. ఈ ఘటన సనత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..ఉత్తరప్రదేశ్​కి చెందిన రాజేశ్​ సనత్ నగర్ లోని జింకల వాడలో తన భార్య ఊర్మిళ(30), కొడుకు(4)తో కలిసి ఉంటున్నాడు. కుటుంబ కలహాల కారణంగా ఆదివారం భార్య ను రాడ్డుతో కొట్టి చంపిన రాజేశ్..తన కొడుకు కిశోర్ ను వాటర్ బకెట్ లో ముంచి హత్య చేసి పారిపోయాడు. సమాచారం అందుకున్న సనత్ నగర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు రాజేశ్​ ఉత్తర్ ప్రదేశ్​ నుంచి 10 రోజుల క్రితం సిటీకి వచ్చినట్టు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.  రాజేష్ కోసం గాలిస్తున్నామని..ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు.