
బషీర్‌బాగ్, వెలుగు: తమ యాప్‌లో ఇన్వెస్ట్ చేసి గేమ్ ఆడితే అధిక లాభాలు వస్తాయని నమ్మించి ఆన్లైన్ స్కామర్లు ముషీరాబాద్‌కు చెందిన యువకుడి వద్ద రూ.13 లక్షల 42 వేలు కొట్టేశారు. సఫైర్ బెట్టింగ్ క్యాసినో యాప్ ప్రతినిధి అంటూ కాల్ చేసి.. అతడితో తమ యాప్‌లో రూ.13,42,778 పెట్టుబడి పెట్టించారు. డబ్బులు విత్ డ్రా కాకపోవడంతో బాధితుడు స్కామ్ అని గుర్తించాడు.
మరో ఘటనలో వెహికల్చలాన్ పేరుతో ఏపీకే ఫైల్ పంపించిన స్కామర్స్ సికింద్రాబాద్‌కు చెందిన వ్యక్తి వద్ద రూ.లక్షా 72 వేలు లాగేశారు. సైబర్ క్రైం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.