తల్లి అంత్యక్రియలకు నోచుకోలె

తల్లి అంత్యక్రియలకు నోచుకోలె

షాంఘై నుంచి వచ్చిన కొడుకు

‘కరోనా’ జాగ్రత్త చర్యల్లో భాగంగా ఆపిన ఆఫీసర్లు

కరోనా ఎఫెక్ట్‌‌‌‌తో ఓ వ్యక్తి కన్న తల్లిని చివరి చూపు చూసుకోలేకపోయాడు. తన తల్లి చనిపోయిన విషయం తెలుసుకుని ఆదివారం ఉదయం ఓ వ్యక్తి హైదరాబాద్‌‌‌‌కు వచ్చాడు. వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న చైనాలోని షాంఘై నుంచి అతను రావడంతో ఎయిర్‌‌‌‌‌‌‌‌పోర్ట్‌‌‌‌, హెల్త్ ఆఫీసర్లు అతన్ని అంత్యక్రియలకు పంపించేందుకు ఒప్పుకోలేదు. ఒకవేళ ఆయనకు వైరస్ ఉంటే ఇతరులకు కూడా వ్యాపించే ప్రమాదం ఉండడం, చైనా నుంచి ఎవరొచ్చిన క్వారంటైన్‌‌‌‌లో పెట్టాలని ప్రభుత్వం నిబంధన పెట్టడంతో ఆఫీసర్లు ఈ నిర్ణయం తీసుకున్నారు. ‘అతన్ని పంపించాలని ఉన్నా, ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా పంపించలేకపోయాం’ అని ఉన్నతాధికారి ఒకరు ఆవేదన వ్యక్తంచేశారు. ప్రభుత్వ పెద్దలతో చర్చించి, వాళ్ల అనుమతి తీసుకుని చివరకు అతన్ని పంపించాలని నిర్ణయించారు. వైరస్ విస్తరించకుండా అన్ని జాగ్రత్తలు, పర్సనల్ ప్రొటెక్షన్‌‌‌‌ ఎక్విప్‌‌‌‌మెంట్ వేసి పంపించాలనుకున్నరు. కానీ, అప్పటికే సమయం దాటిపోయింది. తల్లి అంత్యక్రియలు పూర్తయ్యాయని తెలిసింది. ఆ టైమ్‌‌‌‌లో వెళ్లినా ఉపయోగం లేకపోవడం, తన వల్ల ఇంకొకరికి వైరస్ విస్తరించే ప్రమాదం ఉన్న నేపథ్యంలో క్వారంటైన్‌‌‌‌ సెంటర్‌‌‌‌‌‌‌‌కు వెళ్లాలని అతను నిర్ణయించుకున్నాడు. ప్రస్తుతం వికారాబాద్‌‌‌‌ హరిత హోటల్‌‌‌‌లో ఆ వ్యక్తి క్వారంటైన్‌‌‌‌లో ఉన్నట్టు సమాచారం.