జిమ్‌లో వ్యాయామం చేస్తూ.. గుండెపోటుతో కుప్పకూలిన యువకుడు

జిమ్‌లో వ్యాయామం చేస్తూ.. గుండెపోటుతో కుప్పకూలిన యువకుడు

హర్యానాలోని ఫరీదాబాద్‌లో షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. వ్యాయామం చేస్తూ గుండెపోటుతో 37 ఏళ్ల వ్యక్తి కుప్పకూలాడు. బరువు 170 కిలోలకు పైగా ఉండటంతో అతను 4 నెలల క్రితమే జిమ్‌లో చేరాడు. వ్యాయామం చేయడం ద్వారా బరువు తగ్గాలని అతను జిమ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. 

జిమ్‌లో అమర్చిన సీసీటీవీ కెమెరాలో 37యేళ్ల పంకజ్ శర్మ అనే వ్యక్తి జిమ్ చేస్తున్న ఆకస్మాత్తుగా స్పృహ కోల్పోయి నేలపై ఎలా పడిపోయాడో స్పష్టంగా కనిపిస్తోంది. ఈ సమయంలో చుట్టుపక్కల వారు అతనికి CPR కూడా ఇచ్చారు.కానీ ఆ వ్యక్తి స్పృహలోకి రాలేదు. జిమ్‌లో ఉన్న వ్యక్తులు వెంటనే అతన్ని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అతను అతను చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు.

ఇలాంటి ఘటనలు గతంలో కూడా జరిగాయి.జిమ్‌లలో వ్యాయామం చేస్తూ బరువు తగ్గేందుకు ప్రయత్నిస్తూ ఆకస్మిక గుండెపోటులు లేదా ఆకస్మిక మరణాలను సంభవించిన ఘటనలు చాలా ఉన్నాయి. గతంలో హర్యానాలోని ఒక సీనియర్ పోలీసు అధికారి కూడా జిమ్‌లో వ్యాయామం చేస్తూ గుండెపోటుతో మరణించారు.తరుచుగా ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటుండటంతో ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి.