వామ్మో.. పియానోను ఇలా కూడా ప్లే చేయొచ్చా?

వామ్మో.. పియానోను ఇలా కూడా ప్లే చేయొచ్చా?

న్యూఢిల్లీ: ఎండాకాలం రాగానే అందరికిీ పుచ్చ పండ్లు గుర్తొస్తాయి. హాట్ హాట్ సమ్మర్ లో వాటర్ మిలన్ తింటే కూల్ అయిపోవచ్చు. కానీ ఇక్కడో వ్యక్తి వాటర్ మిలన్ తో పియానో ప్లే చేస్తూ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాడు. వాటర్ మిలన్ ను మ్యూజిక్ ఇన్ స్ట్రుమెంట్ గా వాడటమేంటని షాక్ అవుతున్నారా? చాలా మంది నెటిజన్స్ కూడా ఈ వీడియో చూసే మీలాగే సంభ్రమాశ్చర్యానికి గురవుతున్నారు. వివరాలు.. స్విమ్మింగ్ పూల్ దగ్గర వాటర్ మెలన్ తో చేసిన కీబోర్డు ఎదుట ఒక వ్యక్తి కూర్చున్నాడు. సదరు పుచ్చ పండ్లకు కేబుల్స్ అటాచ్ అయి ఉన్నాయి. అతడి కాళ్ల దగ్గర డ్రమ్స్ ఏర్పాటు చేసి ఉన్నాయి. ఆయా వాటర్ మెలన్ పీసెస్ పై అతడు వేళ్లు నిమురుతూ ఉంటే మ్యూజిక్ ప్లే అవడం వెరైటీగా ఉంది. మరి ఇది నిజంగా జరిగిందా లేదా వేరే మ్యూజిక్ సెటప్ తో సౌండ్ ప్లే చేశారా అనేది తెలియ రాలేదు. ఈ వీడియోను మెజెర్గ్ అనే ట్విట్టర్ యూజర్ పోస్ట్ చేశాడు. ఇప్పటివరకు 1.7 మిలియన్ల మంది ఈ వీడియోను చూశారు. అదెలా పని చేస్తుందో వివరించాలని, ఆ వ్యక్తి తప్పకుండా మ్యూజిషియన్ తోపాటు సైంటిస్ట్ కూడా అయ్యుంటాడంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ వాటర్ మిలన్ పియానో మ్యూజిక్ ను మీరూ వినండి!