కరోనాతో కోలుకున్న వ్యక్తికి.. మళ్లీ పాజిటివ్‌

కరోనాతో కోలుకున్న వ్యక్తికి.. మళ్లీ పాజిటివ్‌
  •  హిమాచల్‌ ప్రదేశ్‌లో ఘటన
    యునా: కరోనా నుంచి కోలుకున్న వ్యక్తికి మళ్లీ పాజిటివ్‌ వచ్చింది. హిమాచల్‌ ప్రదేశ్‌లోని యునాకు చెందిన ఒక వ్యక్తికి గతంలో కరోనా పాజిటివ్‌ రావడంతో హాస్పిటల్‌లో చేరి ట్రీట్‌మెంట్‌ తీసుకోగా.. అతను పూర్తిగా కోలుకున్నాడు. అయితే శనివారం ఆ వ్యక్తికి తిరిగి వ్యాధి సోకినట్లు డాక్టర్లు గుర్తించారు. దీంతో హిమాచల్‌ ప్రదేశ్‌లో కేసుల 40కి పెరిగినట్లు అధికారులు చెప్పారు. యునా జిల్లాలో ముగ్గురు కోలుకోగా వారిలో ఒక వ్యక్తికి మళ్లీ పాజిటివ్‌ రావడం అధికారుల్లో కలకలం రేపుతోంది. వ్యాధి ఎలా సోకిందనే విషయంపై వివరాలు సేకరించడం మొదలు పెట్టారు.