వందే భారత్‌ రైల్లోని ఆహారం.. నూనె లేకుండా మిర్చి మసాలా.. 

వందే భారత్‌ రైల్లోని ఆహారం.. నూనె లేకుండా మిర్చి మసాలా.. 

వందే భారత్‌ రైల్లో సరఫరా చేసిన ఆహారం విషయంలోప్రయాణికులు అసహనం వ్యక్తం చేశారు. ఎక్స్‌ వేదికగా రైల్వే ఆహార సేవలపై ఫిర్యాదు చేశారు. రైలులో వడ్డించిన భోజనం గురించి  వ్యంగ్యంగా  కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కూడా  ట్వీట్​ ద్వారా ట్యాగ్ చేశారు.  వందే భారత్ రైలులో నూనె లేకుండా  మిర్చ్ మసాలా లాంటి ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించినందుకు @అశ్విని వైష్ణవ్ జీకి ధన్యవాదాలు " అని కపిల్ తన ట్వీట్‌లో రాశారు. దానితో పాటు, అతను చిక్‌పీస్ కర్రీ చిత్రాన్ని కూడా షేర్​చేశాడు.

ఈ పోస్ట్ ఫిబ్రవరి 19న భాగస్వామ్యం పోస్ట్​ చేశారు.  ఇప్పటి వరకు (వార్త రాసే సమయం వరకు ) 2.1 మిలియన్లకు పైగా వీక్షణలను పొందింది. పోస్ట్‌కు అనేక లైక్‌లు .. కామెంట్‌లు కూడా వచ్చాయి.  చాలామంది నెటిజన్లు ఈ  వంటకం ఏమిటని ప్రశ్నించారు. ఇది నీటిలో ఉడకబెట్టిన పానీపూరీలా ఉందని కామెంట్​ చేశారు.  మరొకరు ఇది రసగుల్లా అనుకున్నానని  .. తరువాత జూమ్​ చేసి చూస్తే చోళ అని గమనించినట్లు పోస్ట్​ చేశారు.  ఇంకొకరు ఇంత భయంకరమైన వంటకం ఎప్పుడూ చూడలేదని వ్యాఖ్యానించాడు.  ఈ ట్వీట్​ చూసిన X వినియోగదారు, ఆకాష్ కేశారి, రైలులో వడ్డించిన ఆహారం పట్ల తన నిరాశను వ్యక్తం చేశాడు.

ఫుడ్​ ఆర్డరిచ్చిన వ్యక్తి  ఈ సంఘటన గురించి ట్వీట్ చేస్తూ, "@indianrailway__, @AshwiniVaishnaw, @VandeBharatExp హాయ్ సార్, నేను NDLS నుండి BSBకి 22416 నంబర్​ ట్రైన్​లో ప్రయాణంలో ఉన్నాను.  రైల్వే శాఖ వారిచ్చిన ఆహారం చాలా దరిద్రంగా ఉంది.. వాసన వస్తుంది. దయచేసి నా డబ్బులు ఇవ్వండని ట్వీట్​ చేశారు. రైలులో ఆహారం అమ్మే వారు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ బ్రాండ్ ను పాడు చేస్తున్నారంటూ.. ఫుడ్​ కు సంబంధించిన ఫొటోలను పోస్ట్​ చేశాడు. ." ఆహార చిత్రాలను కూడా పోస్ట్ చేశాడు.

 ఘటనపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకొంటామని ఐఆర్‌సీటీసీ వివరణ ఇచ్చింది. ఆకాశ్‌ కేసరి అనే ప్రయాణికుడు తనకు రైల్లో సరఫరా చేసిన ఆహారం పాచిపోయిందని చెప్తూ వాటి పోటోలను ఎక్స్‌లో పంచుకున్నారు. తాను నిరాశకు గురయ్యాయని, తాను చెల్లించిన డబ్బులను వెనక్కివ్వాలని కోరారు. దీనిపై ఫిర్యాదు నమోదు చేసుకొన్నామని రైల్వే శాఖ తెలిపింది.