చిరుతపులి గోర్లు దొంగిలించిన వ్యక్తికి ..మూడేండ్ల జైలు శిక్ష, రూ.25 వేల జరిమానా

చిరుతపులి గోర్లు దొంగిలించిన వ్యక్తికి ..మూడేండ్ల జైలు శిక్ష, రూ.25 వేల జరిమానా

చండ్రుగొండ, వెలుగు : చిరుతపులి కాలి గోర్లు దొంగిలించిన వ్యక్తికి మూడేండ్ల జైలు శిక్షతోపాటు రూ.25 వేల జరిమానా విధిస్తూ సోమవారం కొత్తగూడెం మొదటి అదనపు జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కె.సాయి తీర్పు వెల్లడించారు.  కేసు వివరాలిలా ఉన్నాయి.. 2016లో అప్పటి ఉమ్మడి మండలంలోని అబ్బుగూడెం బీట్ పరిధిలోని 35 కంపార్ట్​మెంట్35(బీ2) ప్రాంతంలో  చిరుతపులి చనిపోయిందన్న సమాచారం మేరకు బీట్ ఆఫీసర్ రమేశ్ బాబు అక్కడి వెళ్లారు. 

చనిపోయి చిరుతపులి కాలి గోర్లు కత్తిరించినట్లు గుర్తించాడు. కొంత దూరం వెళ్లగా రెండో చిరుతపులి చనిపోయి కనిపించింది. ఈ విషయాన్ని రామవరం రేంజర్ మధుసూదన్ కి సమాచారం అందించారు. ఆయన పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అబ్బుగూడెం గ్రామానికి చెందిన మరకాల లక్ష్మారెడ్డి మేకలపై విషప్రయోగం చేసి చిరుతపులులను చంపినట్లు విచారణలో తేలింది. 

మొదటి చిరుత పులి నాలుగు కాలి గోర్లు కత్తిరించి తీసుకెళ్లిన అధికారులు నిర్ధారించారు. అతడి వద్ద నుంచి పులి గోర్లను స్వాధీనం చేసుకున్నారు. నేరం రుజువు కావడంతో లక్ష్మారెడ్డికి మూడేండ్ల జైలు శిక్షతోపాటు రూ.25 వేలు జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు వెల్లడించారు.