పోలీసులు ఆపారనే కోపంతో బైకుకు నిప్పంటించాడు

పోలీసులు ఆపారనే కోపంతో బైకుకు నిప్పంటించాడు

హైదరాబాద్ మైత్రివనం సర్కిల్ వద్ద ద్విచక్ర వాహనాన్ని ట్రాఫిక్ పోలీసులు ఆపారనే కోపంతో.. అశోక్ అనే వ్యక్తి తన బైక్ ను తానే పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎల్లారెడ్డిగూడకు చెందిన ఆశోక్ రాంగ్ రూట్ లో రావటంతో పోలీసులు అతని బైక్ ను అడ్డుకున్నారు.

దీంతో తన బైక్ ను తానే పెట్రోల్ పోసి తగులబెట్టాడు. వెంటనే పోలీసులు మంటలను ఆర్పేశారు. అశోక్ మాత్రం పోలీస్ కానిస్టేబుల్ దురుసుగా మాట్లాడటం వల్లే బైక్ ను కాల్చేశానని తెలిపాడు.పోలీసులు అశోక్ ను అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు.