లవర్ తండ్రిపై కోపం... యోగి బెదిరింపు కాల్లో బిగ్ ట్విస్ట్

లవర్ తండ్రిపై కోపం... యోగి బెదిరింపు కాల్లో బిగ్ ట్విస్ట్

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను చంపేస్తామంటూ బెదిరింపు కాల్ రావడం కలకలం రేపింది.  అత్యవసర సేవల కోసం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించిన నంబర్  డయల్ 112 కు మెసేజ్ ద్వారా ఆయనకు బెదిరింపు కాల్  వచ్చింది, అందులో తాను త్వరలో సీఎం యోగిని చంపుతానని ఆ వ్యక్తి పేర్కొన్నాడు.  దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అమీన్ అనే యవకుడిని ఆదుపులోకి తీసుకున్నారు. 

 అనంతరం అతన్ని లోతుగా విచారణ చేయగా అశ్చర్యపోయే విషయం బయటకు వచ్చింది.  యోగికి బెదిరింపు కాల్ రావడంతో ముందుగా  ఆ కాల్‌ను ట్రేస్‌ చేసిన పోలీసులు ఫోన్‌ యజమాని సజ్జాద్‌ హుస్సేన్‌గా గుర్తించారు. అతన్ని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారించారు. అయితే తన ఫోన్ కొద్దిరోజుల క్రితమే మిస్ అయినట్లుగా అతను చెప్పాడు . 

ఇదే విషయంపై పోలీసులు ఇరుగుపొరుగువారిని అడిగి తెలుసుకోగా అమీన్ అనే యువకుడు సజ్జాద్‌ హుస్సేన్‌ కూతుర్ని ప్రేమించాడని, ఇదే విషయంలో అమీన్ సజ్జాద్‌తో గొడవ పడ్డాడని పోలీసులు తెలిపారు.  ఈ క్రమంలోనే సజ్జాద్‌ హుస్సేన్‌ ఫోన్‌ను దొంగతనం చేసి ఉంటాటని పోలీసులు అనుమానించారు. 

అతడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు తమదైన స్టైల్ లో విచారించగా, నిందితుడిపై ఫోన్ దొంగతనంతో పాటు ఇతర సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లుగా తెలిపారు. ఏప్రిల్ 26  బుధవారం రోజున అతన్ని  లఖ్‌నవూ కోర్టులో హాజరు పరచనున్నారు.