హైదరాబాద్ నాచారంలో వైన్స్ ముందు వ్యక్తి అనుమానాస్పద మృతి..

హైదరాబాద్ నాచారంలో వైన్స్ ముందు వ్యక్తి అనుమానాస్పద మృతి..

హైదరాబాద్ లోని నాచారంలో ఘోరం జరిగింది. నాచారం పోలిస్ స్టేషన్ పరిధిలోని ఎస్ డీ వైన్స్ ముందు ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. సోమవారం ( నవంబర్ 10 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మృతి చెందిన వ్యక్తి పేరు సుమన్ అని.. గుండెపోటు రావడంతో కిందపడి చనిపోయాడని అంటున్నారు పోలీసులు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు పోలీసులు

వ్యక్తి మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. గుండెపోటు రావడమే సుమన్ మృతికి కారణమా లేక ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఈ ఘటనకు సంబందించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి.

ALSO READ : అమెరికాలో తెలుగు స్టూడెంట్ అనుమానాస్పద మృతి..
 
వైన్ షాపు ముందు బండి పార్క్ చేసిన సుమన్.. ఒక్కసారిగా కుప్పకూలాడు. అక్కడే ఉన్న జనం పోలీసులకు సమాచారం అందించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలాని చేరుకున్న పోలీసులు సుమన్ గుండెపోటుతోనే మరణించినట్లు భావిస్తున్నట్లు తెలిపారు ఈ మధ్యకాలంలో తరచూ ఇలాంటి ఘటనలు జరుగుతున్న క్రమంలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రజలు. అప్పటిదాకా యాక్టివ్ గా ఉన్నవారు సడన్ గా ఘటనలు చూస్తుంటే భయం కలుగుతోందని అంటున్నారు ప్రజలు.