బెంగుళూరులో కరెన్సీ వాన..ఎగబడ్డ జనం

బెంగుళూరులో కరెన్సీ వాన..ఎగబడ్డ జనం

బెంగుళూరులో నోట్ల వర్షం కురిసింది. కేఆర్ మార్కెట్ ప్రాంతంలో కరెన్సీ వాన పడింది.  ఒక్కసారిగా నోట్ల వర్షం కురవడంతో జనం ఎగబడ్డారు. ఓ గుర్తుతెలియని వ్యక్తి బ్రిడ్జిపై నుంచి రూ.10 నోట్లను వెదజల్లాడు. దీంతో జనం నోట్లను పట్టుకునేందుకు గుమిగూడారు. దీంతో స్థానికంగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. 

కేఆర్ మార్కెట్ వద్ద సిర్సి సర్కిల్ ఫ్లై ఓవర్ పైనుంచి ఓ వ్యక్తి రూ. 10 నోట్లను ప్రజలపైకి విసిరేశాడు. ఆ నోట్లను అందుకునేందుకు కింద ఉన్న జనం పోటీలు పడ్డారు. బ్రిడ్జిపై అయితే  వాహనాలు ఆపి మరీ డబ్బును ఇవ్వాలని వేడుకున్నారు.  నోట్లు విసిరిన వ్యక్తి సూటుబూటు ధరించి మెడలో ఓ గోడ గడియారాన్ని తగిలించుకున్నాడు. చేతిలో సంచి పట్టుకుని రూ. 10 నోట్లను  వెదజల్లాడు. ఆ వ్యక్తి నోట్లు విసిరేస్తుంటే కొందరు వీడియోలు తీశారు. ప్రస్తుతం  దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.