రెస్టారెంట్​లలో ఫుడ్​ తినడమే ఆయన పని

రెస్టారెంట్​లలో ఫుడ్​ తినడమే ఆయన పని

ఫుడ్​ని బాగా ఎంజాయ్ చేస్తూ తినేవాళ్లు టేస్టీ ఫుడ్ ఎక్కడ దొరుకుతుందో కనుక్కొని మరీ వెళ్లి తింటారు. ఇంకొందరు అదే పనిగా యూట్యూబ్​లో వ్లాగ్స్ కూడా చేస్తుంటారు. తిన్న ఫుడ్​ గురించి ఫీడ్ బ్యాక్​ ఇస్తుంటారు. కానీ... ఒకతను మాత్రం అమెరికాలో ఉన్న చైనీస్​ రెస్టారెంట్​లు ఎన్ని ఉన్నాయో వాటన్నింటిలో ఫుడ్ టేస్ట్ చేయాలని కంకణం కట్టుకున్నాడు.

డేవిడ్ కె. చాన్​... అమెరికా సిటిజన్​షిప్ ఉన్న చైనీయుడు. ఇప్పటికే అమెరికాలో ఉన్న 8000 రెస్టారెంట్లు చుట్టేశాడు. వామ్మో ఇంత ఓపిగ్గా తిరిగాడంటే మంచి ఫుడ్​ లవర్​ అయి ఉంటాడు. పైగా యూత్​కి ఈ మధ్య ఇలాంటి వెరైటీ పనులు చేసి వైరల్ అవ్వడం అలవాటైంది. ఆయన కూడా అలా ఫేమస్​ అవ్వాలని చేశాడనుకుంటున్నారా? కానే కాదు. ఆయనకు 72 ఏండ్లు. ఆ వయసులో మనవళ్లు, మనవరాళ్లతో ఎంజాయ్​ చేస్తూ గడిపేస్తుంటారు చాలామంది. కానీ.. చాన్​ మాత్రం అలా కాదు. చాన్​1960 నుంచి చైనీస్​ రెస్టారెంట్​లలో ఫుడ్​ తినడం ఒక పనిగా పెట్టుకున్నాడు. ఎందుకలా అంటే... ‘‘అమెరికాలో ఉన్న చైనీయుల చరిత్ర అంటే నాకు ఆసక్తి. అందుకే అమెరికాలో ఉంటూ చైనీస్ ఫుడ్ తినడం నాకు నచ్చింది. దాంతో నేను దేశంలో ఉన్న అన్ని చైనీస్​ రెస్టారెంట్​లలో ఫుడ్ టేస్ట్ చేయాలని డిసైడ్ అయ్యాను’’ అంటున్నాడు చాన్. 

ఇప్పటికే సోషల్ మీడియాలో ఈయన ఫేమస్​ అయ్యాడు. అందరూ ఈయన్ని ‘రెస్టారెంట్ కలెక్టర్​’ అని పిలుస్తారు. ‘‘ఈ వయసులో ఇంత ఫిట్​గా ఎలా ఉన్నారు?’’ అని అడిగితే.. ‘‘నేను షుగర్, కొలెస్ట్రాల్​ లెవల్స్​ తక్కువ ఉన్న ఫుడ్​ తినడానికి ప్రిఫర్​ చేస్తాను. రెగ్యులర్​గా ఎక్సర్​సైజ్​ చేస్తాను’’ అంటున్నాడు చాన్. ఓపిక ఉన్నంత వరకు ఇలాగే చైనీస్ రెస్టారెంట్​లను వెతుక్కుంటూ వెళ్లి అక్కడ ఫుడ్ లాగించడమే తన ఫ్యూచర్​ ప్లాన్​ అంటున్నాడు​.