మొసలి వేషం వేసుకొని మొసలినే ఆటపట్టించిన వ్యక్తి

మొసలి వేషం వేసుకొని మొసలినే ఆటపట్టించిన వ్యక్తి

మొసలి వేషం వేసుకుని ఓ వ్యక్తి  మొసలినే ఆటపట్టిస్తున్న వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ చిన్న క్లిప్‌ను నరేంద్ర సింగ్ అనే యూజర్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఒక వ్యక్తి తన ప్రాణాలను పణంగా పెట్టి  మొసలికి దగ్గరగా వెళ్లడం, దాన్ని పదేపదే ఆటపట్టించడాన్ని ఈ వీడియోలో గమనించవచ్చు. దాంతో పాటు " కౌన్సా నషా కియే హై... (అతను ఏ మందు తాగాడు?)" అనే క్యాప్షన్ ను కూడా అడ్మిన్ జత చేశారు. ఈ పోస్ట్‌కి వందల కొద్ది లైక్‌లు, కామెంట్‌లు వచ్చాయి. 

10సెకన్ల ఈ వీడియో ఫుటేజీలో ఒక వ్యక్తి నది ఒడ్డున పడుకుని నలుపు రంగులో ఉన్న మొసలి వేషాన్ని ధరించాడు. నది ఒడ్డున ఉన్న మొసలికి చేరువగా వచ్చిన ఆ వ్యక్తి.. దాన్ని తాకుతూ పదే పదే ఆటపట్టించాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో వైరల్‌గా మారింది. ఈ వీడియోకు చనిపోవడానికి సృజనాత్మక మార్గం అని ఒకరు కామెట్ చేయగా.. నీటిలోకి వెళ్లే వరకే ఆ వ్యక్తి ఆటలైనా, వినోదాలైనా అని రాసుకొచ్చారు. మరొక యూజర్ "మాస్టర్ ఇన్ వేషం" అని జోడించాడు.