39 పెళ్లిళ్లు.. 94 మంది పిల్లలు.. అందరి కోసం ఓ పెద్ద అపార్ట్ మెంట్

39 పెళ్లిళ్లు.. 94 మంది పిల్లలు.. అందరి కోసం ఓ పెద్ద అపార్ట్ మెంట్

ఒక్క భార్యతోనే వేగలేకపోతున్నాం, నా ముఖానికి ఇంకొక భార్య అంటూ చాలామంది వేళాకోలంగా చెబుతుంటారు. కాని  ఓ వ్యక్తి ఏకంగా 39 పెళ్లిళ్లు చేసుకొని... 94 మంది పిల్లలకు తండ్రయ్యాడు.   ఆయనెక్కడో లేడండోయ్ భారతదేశంలో మిజోరామ్ రాష్ట్రంలోని బక్తావంగ్ గ్రామంలో ఉన్నాడు.  అయితే  ఆయన 2021లో మరణించాడు.  

మిజోరమ్ రాష్ట్రం బక్తావంగ్ గ్రామంలో ఓ నాలుగు అంతస్తుల భవనం ఉంది.ఆ భవనం లో ఒకే ఫ్యామిలీకి చెందిన 181 మంది నివసిస్తున్నారు.వీరంతా 72 ఏళ్ల జియోనా కుటుంబానికి చెందిన సభ్యులు.ఆయనకు 39 భార్యలు.. 94 మంది సంతానంఉన్నారు.14 మంది కొడుకులకు పెళ్లిళ్లు కూడా చేశారు.జియోనా కు 40 మంది మనువలు, మనవరాళ్ళు ఉన్నారు.ఇంత మంది సభ్యులు కలిసి మెలసి.మొత్తం నాలుగు అంతస్తుల భవనం లో ఉంటారు. వారు నివసించే ఇంట్లో దాదాపు 100 గదులు ఉన్నాయి.  అందరూ కలిసి వంటావార్పు చేసుకొంటారు.1945లో పుట్టిన జియోనాకు 17వ ఏటనే  మొదటి వివాహం  అయింది. ఆయనకు మొత్తం  39 మంది భార్యలు.చిన్న భార్య వయసు 38 ఏళ్లు. జియోనా ఒక ఏడాదిలో ఏకంగా 10 పెళ్లిళ్లు చేసుకున్నారు.క్రైస్తవ మతానికి చెందిన చానా తెగలో బహు భార్యత్వం ఉంది.

ఇది ఒక కుటుంబం కథ.జియోనా తన భార్యలతో ఎలా గడుపుతాడని అందరికీ అనుమానం రావచ్చు.ఆయన మాత్రం అంత టెన్షన్ అవసరం లేదని, భార్యలే ఒకరితో ఒకరు మాట్లాడుకుని సమయం కేటాయించుకుంటారని జియోనా అన్నారు.  ఈ కుటుంబం చానా పాల్ అని పిలువబడే క్రైస్తవ సంఘానికి చెందినది.  జియోనా  తాత 1942లో ఈ సంఘాన్ని ఏర్పాటు చేశారు . ఈ సంఘంలో  బహుభార్యత్వం ఆచారం  తమ తెగలో మొదటి నుంచి ఉందని చెప్పారు. జియోనా ఎవరినీ మోసగించి పెళ్లి చేసుకోలేదని...  ఒక్కోరోజు ఒక్కో భార్యతో గడిపేవారట.  ఎనిమిది మంది భార్యలు ఆయన అవసరాలు తీర్చుతారు. కుటుంబంలోఒక్కొక్కరు ఒక్కో  ఉద్యోగం ఇవ్వబడింది.చనా కుమారుల్లో కొంతమంది వ్యవసాయం చేస్తుంటే, మరికొందరు వ్యాపారం చేస్తున్నారు. చనా కుటుంబంలోని పిల్లలు చదువుకోడానికి అక్కడ ఏకంగా ఒక స్కూలే ఉంది.అందులో మిజోరం స్టేట్ సిలబస్‌తో పాటు, చనా జీవిత చరిత్ర కూడా బోధిస్తుండటం గమనార్హం.

అందరూ భోజనానికి కూర్చోవాలంటే 39 కోళ్లు వండాలి.అందరూ అన్నం తినాలంటే కనీసం 50 కిలోల బియ్యం వండాలి.60 కిలోల బంగాళదుంపలు కూర ,  25 కిలోల పప్పు ఉంటేనే పూట గడిచేది .  ఇంట్లో పెద్ద వంటగది ఉంది.   దాదాపు 180 మంది కుటుంబానికి ఆహారం తయారు చేస్తారు. అసలు ఇదంతా ఎందుకు చేస్తున్నారు అంటే.? అది తమ జాతి సంప్రదాయమని చెబుతున్నాడు మన 73 ఏళ్ల మిస్టర్ పెళ్లి కొడుకు.తన జాతిని ప్రపంచవ్యాప్తంగా విస్తరించాలనే లక్ష్యంతో ఆయన ఈ పెళ్లి చేసుకుంటున్నాడట.