మన డాక్టర్ బాబే మూవీ టీజర్ రిలీజ్...

మన డాక్టర్ బాబే మూవీ టీజర్ రిలీజ్...

శ్రీస్కంద హీరోగా చలపతి కుమార్ పువ్వుల దర్శకత్వంలో కృతాక్షి నిర్మిస్తున్న చిత్రం  ‘మన డాక్టర్ బాబే’.  శనివారం టీజర్ లాంచ్ ఈవెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను నిర్వహించారు. అతిథిగా హాజరైన దర్శకుడు వీఎన్ ఆదిత్య  ఇలాంటి  కామెడీ సినిమాలు మరిన్ని  రావాలంటూ టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు బెస్ట్ విషెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చెప్పారు.  శ్రీ స్కంద మాట్లాడుతూ ‘ఇదొక సెన్సిటివ్ స్టోరీ.  టీజర్ చూసి కేవలం యూత్ సినిమా అని అనుకోకండి. ఇది కంప్లీట్ ఫ్యామిలీ మూవీ.  క్లైమాక్స్ వరకు నవ్వుతూనే ఉంటారు. 

ఈవీవీ గారు, జంధ్యాల గారి సినిమాల్ని చూసినట్టుగా ఉంటుంది.  నా మొదటి సినిమాలోనే అలీ గారు, రాజీవ్ కనకాల గారు, శాంతి గారు, కోటేశ్వరరావు వంటి గొప్ప వారితో నటించే అవకాశం లభించింది’ అని అన్నాడు. ఇలాంటి చిన్న చిత్రాల్ని ఆడియెన్స్ ఆదరించాలని నటుడు అలీ అన్నారు.  

దర్శకుడు చలపతి కుమార్ మాట్లాడుతూ ‘ఇది కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైనర్.   ప్రతీ సీన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఆడియెన్స్ కచ్చితంగా నవ్వుతారు’ అని చెప్పాడు. ఈ సినిమాతో తమను సపోర్ట్ చేయాలని నిర్మాత కృతాక్షి కోరారు.  విశ్వ కార్తికేయ, శాంతి,  మోహన సిద్ధి, కెమెరామెన్ కిషోర్ బోయిడపు,  లిరిసిస్ట్ రాంబాబు గోసాల పాల్గొన్నారు.