భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు : సింగరేణిలో పలువురు ఆఫీసర్లను ట్రాన్స్ఫర్ చేస్తూ యాజమాన్యం మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. ఈఅండ్ఎం విభాగంలో డీజీఎం, ఎస్ఈ, డీవైఎస్ఈ, ఈఈ, జేఈలు 31 మంది, పర్సనల్ విభాగంలో 15 మంది పర్సనల్మేనేజర్లు, డీవైపీఎంలు, సీనియర్ పర్సనల్ఆఫీసర్లు, ఫైనాన్స్ విభాగంలో అడిషనల్ జీఎం స్థాయి నుంచి జూనియర్అకౌంట్స్ ఆఫీసర్స్ స్థాయిలో 11 మందిని పలు ప్రాంతాలకు సింగరేణి బదిలీ చేసింది.
