
పంజాగుట్ట, వెలుగు: పంజాగుట్ట నిమ్స్ లో బీఎస్సీ నర్సింగ్ కోర్సుకు దరఖాస్తు చేసుకోవాలని యాజమాన్యం కోరింది. బీపీటీలో 50 సీట్లు, బీఎస్సీ నర్సింగ్‌లో 100 సీట్లు, బీఎస్సీ డిగ్రీ కోర్సులో 100 సీట్లు ఉన్నాయని తెలిపింది. ఈ నెల 23లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.
నిమ్స్ సేవలు భేష్
తమిళనాడు వైద్య ఆరోగ్య శాఖ సెక్రటరీ సుప్రియ సాహు శుక్రవారం నిమ్స్‌ను సందర్శించారు. పేషెంట్లకు అందిస్తున్న సేవలను కొనియాడారు. నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్పతో కలిసి వార్డులను పరిశీలించారు. డయాలసిస్ విభాగంలోని టెలీ డయాలసిస్ విధానాన్ని పరిశీలించారు.