PF డబ్బులు అడిగితే పడుకోమన్నాడు : ఈ నీచుడిని ఏం చేద్దామంటారు..!

PF డబ్బులు అడిగితే పడుకోమన్నాడు : ఈ నీచుడిని ఏం చేద్దామంటారు..!

అసలే ఇంటిపెద్ద అయిన తండ్రి చనిపోయి కుటుంబం రోడ్డున పడింది. ఇన్నాళ్లు ఉద్యోగం చేసి తండ్రి కూడబెట్టిన ప్రావిడెంట్ ఫండ్ వస్తే కొంత ఆర్థికంగా ఆసరాగా ఉంటుంద నుకుంది అతని కూతురు..దీంతో తండ్రి పనిచేసిన కార్యాలయం సిబ్బందిని సంప్రదించింది. అయితే  తండ్రి పీఎఫ్ డబ్బులు రావాలంటే కూతురుగా నీవో పనిచేయాలి అని అక్కడి ఉద్యోగి చెప్పడం..ఆ అమ్మాయి  షాక్ కు గురైంది. తన తండ్రి కూడబెట్టిన డబ్బులు తీసుకోవాలంటే తనతో పడుకోవాలని ఆ ఉద్యోగి అనడంతో బోరు న విలపించింది. కొద్ది ధైర్యం తెచ్చుకుని దుష్ట ఉద్యోగి దుర్మార్గపు బుద్ధిని బయటపెట్టేందుకు సిద్ధమైంది.. ఆమె ఎలా అతనికి బుద్ది చెప్పిందో.. వివరాల్లోకి వెళితే.. 

ముంబైకి చెందిన 23 యేళ్ల యువతి.. 2015లో తన 15 ఏళ్ల వయసులో తండ్రి చనిపోయాడు. తమ్ముడు, అమ్మమ్మతో కలిసి ఉంటోంది. తండ్రి చనిపోకముందు ప్రావిడెంట్ ఫండ్ కు నామినీగా తన కూతురు పేరును నమోదు చేశాడు. 18 ఏండ్లు నిండితేనే ఆమె పీఎం తీసుకునే అవకాశం ఉంది. దీంతో పీఎఫ్ ఆఫీసులో ఫండ్ విత్ డ్రా కు అన్ని డాక్యుమెంట్లు సబ్మిట్ చేసింది. కానీ అధికారులు తిరస్కరించారు. ఎందుకు తిప్పి పంపారంటే.. ఆమె తండ్రి పీఎఫ్ కు సంబంధించిన పీఎఫ్ ఫైల్ ఇంకా  అతను పనిచేసిన కంపెనీ మేనేజర్ దగ్గరే ఉందని కారణం తెలిపింది. దీంతో ఆ యువతి తన కుటుంబ సభ్యులతో కలిసి తండ్రి పనిచేసిన ఆఫీసుకు వెళ్లింది. హెచ్ ఆర్ మేనేజర్ ను తన తండ్రి పీఎఫ్ ఫైల్ ను పంపాలని కోరింది.  

Also Read :లైంగిక వేధింపుల కేసులో సీఐ అరెస్ట్

అయితే పీఎఫ్ ఫైల్ పంపకుండా ఆలస్యం  చేస్తూ వస్తున్నాడు కంపెనీ మేనేజర్. దీంతో విసిగిపోయిన ఆ యువతి మరోసారి ఆఫీసుకు వెళ్లి అతడిని అడిగింది. దీనికి ఆ దుర్మార్గుడు.. ఈ యుతిని తన దగ్గర పడుకోవాలని బలవంతం చేశారు. దీంతో భయపడిపోయిన ఆమె ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఐపీసీ,  ఇన్ ఫర్మేషన్ యాక్టు కింద పలు కేసుల నమోదు చేశారు. అయితే ఆ హెచ్ ఆర్ మేనేజర్ ను ఇంకా అరెస్ట్ చేయలేదు.