ఎగ్జామ్ లేదు.. ఇంటర్వ్యూ మాత్రమే: డిగ్రీ, బీటెక్ అర్హతతో మేనేజర్ పోస్టులు.. వెంటనే అప్లై చేసుకోండి..

ఎగ్జామ్ లేదు.. ఇంటర్వ్యూ మాత్రమే: డిగ్రీ, బీటెక్ అర్హతతో మేనేజర్ పోస్టులు.. వెంటనే అప్లై చేసుకోండి..

వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ కోసం సెంట్రల్ బ్యాంక్ హోం ఫైనాన్స్(సీబీహెచ్ఎఫ్ఎల్) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు మే 15 తేదీలోగా ఆన్​లైన్​లో అప్లై చేసుకోవచ్చు. 

  • పోస్టుల సంఖ్య: 212.
  • పోస్టులు: స్టేట్ బిజినెస్ హెడ్/ ఏజీఎం 06, స్టేట్ క్రెడిట్ హెడ్/ ఏజీఎం 05, స్టేట్ కలెక్షన్ మేనేజర్ 06, చీఫ్​ ఫైనాన్షియల్ ఆఫీసర్/ ఎజీఎం 01, కంప్లయిన్స్ హెడ్/ ఏజీఎం 01, హెచ్ఆర్ హెడ్/ ఏజీఎం 01, ఆపరేషనల్ హెడ్/ ఏజీఎం 01, లిటిగేషన్ హెడ్/ ఏజీఎం 01, అసిస్టెంట్ లిటిగేషన్ మేనేజర్ 01, సెంట్రల్ లీగల్ మేనేజర్ 01, సెంట్రల్ టెక్నికల్ మేనేజర్ 01, సెంట్రల్ ఆర్​సీయూ మేనేజర్ 01, అనలైటిక్స్ మేనేజర్ 01, ఎంఐఎస్ మేనేజర్ 01, ట్రెజరీ మేనేజర్ 01, సెంట్రల్ ఆపరేషన్ మేనేజర్ 01, బ్రాంచ్ హెడ్ 25, బ్రాంచ్ ఆపరేషన్ మేనేజర్ 19, క్రెడిట్ ప్రాసెసింగ్ అసిస్టెంట్ 20, సేల్స్ మేనేజర్ 46, కలెక్షన్ ఎగ్జిక్యూటివ్ 14. 
  • ఎలిజిబిలిటీ: పోస్టును అనుసరించి ఏదైనా డిగ్రీ, బీటెక్ లేదా బీఈ, ఎల్ఎల్​బీ, సీఏ, 12వ తరగతిలో ఉత్తీర్ణ సాధించి ఉండాలి. 
  • వయోపరిమితి: కనిష్ట  వయోపరిమితి 18 ఏండ్లు, గరిష్ట వయోపరిమితి 45 ఏండ్లు. నిబంధనలను అనుసరించి సంబంధిత వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. 
  • అప్లికేషన్ ఫీజు: జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులకు రూ.1500. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.1000.
  • లాస్ట్ డేట్: మే 15.
  • సెలెక్షన్ ప్రాసెస్: పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.