లవ్ జాతర' నుంచి మానస చౌదరి బర్త్ డే స్పెషల్ పోస్టర్ విడుదల

లవ్ జాతర' నుంచి మానస చౌదరి బర్త్ డే స్పెషల్ పోస్టర్ విడుదల

బబుల్‌‌‌‌‌‌‌‌గమ్, గాయపడ్డ సింహం  చిత్రాలతో హీరోయిన్‌‌‌‌‌‌‌‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న మానస చౌదరి ప్రస్తుతం నటిస్తున్న తాజా చిత్రం ‘లవ్ జాతర’. ఆదివారం ఆమె పుట్టినరోజు సందర్భంగా చిత్రబృందం స్పెషల్ పోస్టర్‌‌‌‌‌‌‌‌ను విడుదల చేసి శుభాకాంక్షలు తెలిపింది. ఈ చిత్రంలో ఆమె శ్రద్ధ పగడాల పాత్రలో కనిపించనున్నట్టు రివీల్ చేశారు. ట్రెడిషనల్ డ్రెస్‌‌‌‌‌‌‌‌లో  వర్షంలో ఆనందంగా డ్యాన్స్ చేస్తున్న ఆమె లుక్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.  

అంకిత్ కొయ్య, మానస చౌదరి హీరోహీరోయిన్లుగా యూజీ ప్రొడక్షన్స్ బ్యానర్‌‌‌‌‌‌‌‌పై ‘సమ్మతమే’ ఫేమ్ దర్శకుడు గోపీనాథ్ రెడ్డి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. కంకణాల ప్రవీణ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. పూర్తి స్థాయి రొమాంటిక్ ఎంటర్‌‌‌‌‌‌‌‌టైనర్‌‌‌‌‌‌‌‌గా రూపొందుతున్న ఈ సినిమాపై ఇప్పటికే ఆసక్తి నెలకొంది.  ఈ చిత్రానికి  చేతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తుండగా, సుజాత సిద్ధార్థ్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్‌‌‌‌‌‌‌‌ను త్వరలో ప్రకటించనున్నట్లు మేకర్స్ వెల్లడించారు.