ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసే కుట్ర : డీసీసీ అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి

ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసే కుట్ర : డీసీసీ అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి
  •     మండిపడ్డ డీసీసీ అధ్యక్షుడు

జైపూర్(భీమారం), వెలుగు: మహాత్మాగాంధీ పేరుతో నాడు కాంగ్రెస్​ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉపాధి హామీ పథకాన్ని బీజేపీ నీరుగార్చే ప్రయత్నం చేస్తోందని మంచిర్యాల డీసీసీ అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి మండిపడ్డారు. ఉపాధి హామీ పథకం పేరు మార్పును నిరసిస్తూ కాంగ్రెస్ ఆధ్వర్యంలో భీమారం మండల కేంద్రంలో దీక్ష చేపట్టారు. దీక్షలో పాల్గొన్న రఘునాథ్​ రెడ్డి మాట్లాడుతూ.. ఉపాధి హామీ పథకంతో సొంత గ్రామాల్లోనే పనిదొరికి వలసలు తగ్గాయన్నారు. 

కేంద్ర ప్రభుత్వం కావాలనే మహాత్మా గాంధీ పేరు తొలగించి పథకాన్ని రద్దు చేసే కుట్ర చేస్తోందని ఆరోపించారు. కావాలంటే ఇంకో కొత్త పథకాన్ని ప్రవేశ పెట్టాలి కానీ, ఉన్న ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేయాలని చూడడం ఏమిటని ప్రశ్నించారు. దీక్షలో కాంగ్రెస్​మండల ప్రెసిడెంట్ మోహన్ రెడ్డి, సీనియర్ నాయకులు పొడేటి రవి, ఉష్కమల్ల పున్నం చందు, మాజీ జడ్పీటీసీలు భూక్య లక్ష్మణ్, రాజ్ కుమార్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.