వంశీని చూస్తుంటే వాళ్ల తాత కాకా వెంకటస్వామిని చూసినట్టు ఉందని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు అన్నారు. మంచిర్యాల నియోజకవర్గం నుంచి లక్ష ఓట్ల మెజారిటీ అందిస్తామన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడంలో ఇంద్రవెల్లి గిరిజన దండోరా సభ స్ఫూర్తిగా నిలిచిందన్నారు. బీఆర్ఎస్ హయాంలో ఓవైపు రైతుబంధు ఇచ్చి, మరోవైపు వడ్ల తరుగు పేరుతో కటింగ్ చేశారని..
కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఈ దోపిడీని అరికట్టామని చెప్పారు. నీటి కొరత ఉన్నప్పటికీ ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి గూడెం లిఫ్టు ద్వారా సాగునీళ్లిచ్చి పంటలను కాపాడామన్నారు. ఎంపీ ఎన్నికల్లో పోలైన ఓట్లలో 75 శాతం కాంగ్రెస్‌కు వస్తే, ఆ గ్రామాలను స్థానిక ఎన్నికల్లో ఏకగ్రీవం చేస్తామని ప్రకటించారు.
ప్రజలకు సేవ చేసే అవకాశం ఇవ్వండి : వినోద్
‘‘మా ఫ్యామిలీ కాంగ్రెస్‌కు చేసిన సేవలను గుర్తించి పార్టీ హైకమాండ్ వంశీకృష్ణకు పెద్దపల్లి ఎంపీగా చాన్స్ఇచ్చింది. వంశీని ఆశీర్వదించండి. ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించండి’’ అని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ కోరారు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావాలంటే పార్టీ మేనిఫెస్టోను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు సూచించారు.