రెండో పెళ్లి తరువాత ఫుల్ జోష్ లో ఉన్నాడు మంచు వారి హీరో మనోజ్(Manchu Manoj). ఓపక్క సినిమాలు చేస్తూనే.. మరోపక్క టీవీ షో చేయడానికి సిద్దమయ్యాడు. ఇక ఆయన హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ వాట్ ది ఫిష్(What the fish) ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఇది ఇలా ఉంటే.. తాజాగా ఈ హీరో భారత కుబేరుడు అంబానీ(Ambani)ని కలిశాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. అంబానీ ఇటీవల జియో వరల్డ్ ప్లాజా(Jio world plaza)ను లాంచ్ చేశారు. ఈ కార్యక్రమం ముంబైలో ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్ కు బాలీవుడ్ స్టార్స్ తో పాటు ఇండియా వైడ్ గా ఉన్న స్టార్స్ ఎందరో హాజరయ్యారు. అందులో మంచు మనోజ్, ఆయన సతీమణి కూడా ఉన్నారు. ఈ సందర్బంగా.. అంబానీతో కలిసి మంచు దంపతులు ఫోటో దిగారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ALSO READ : వరుణ్ లావణ్య పెళ్లి కోసం భారీ ఖర్చు.. మతిపోగొడుతున్న లెక్కలు
