రవితేజకి విలన్గా మంచు మనోజ్? డైరెక్టర్ ఎవరంటే?

రవితేజకి విలన్గా మంచు మనోజ్?  డైరెక్టర్ ఎవరంటే?

మాస్​ మహారాజ్ రవితేజ(Raviteja), కలర్ ఫోటో ఫేమ్ సందీప్ రాజ్(Sandeep Raj) డైరెక్షన్లో ఓ మల్టీస్టారర్ మూవీ తెరకెక్కబోతుంది. ఇప్పటికే స్టోరీ డిస్కషన్స్ కంప్లీట్ చేసుకుని..షూటింగ్ స్టార్ట్ చేయడానికి మేకర్స్ రెడీ అయ్యారట.

లేటెస్ట్గా ఈ మూవీ నుంచి ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తోంది. మల్టీస్టారర్గా వస్తోన్న ఈ మూవీలో రవితేజతో పాటు మాస్కా దాస్ విశ్వక్ సేన్(Vishwaksen) కీ రోల్ ప్లే చేస్తున్నాడని టాక్ వినిపిస్తోంది. అంతే కాకుండా ఈ మూవీలో రవితేజకు విలన్గా మంచు మనోజ్(Manchu Manoj) యాక్ట్ చేస్తాడని సమాచారం. రవితేజని ఎదుర్కోవడానికి బలమైన విలన్ అవసరమని డైరెక్టర్ డిసైడ్ అయ్యాడట.

ఈ మూవీలో విలన్కు పవర్ఫుల్ రోల్ ఉండటంతో మంచు మనోజ్ యాప్ట్ అవుతాడని..స్టోరీ వినిపించారట డైరెక్టర్. మనోజ్ స్టార్ హీరో అయినప్పటికీ విలన్గా ఛాన్స్ వస్తే చేస్తానని..పలు ఇంటర్వూస్ లో కూడా పేర్కోన్నారు. దీంతో త్వరలో ఈ మూవీ నుంచి ఆఫీసియల్ అనౌన్స్ మెంట్ వచ్చే ఛాన్స్ కనిపిస్తోంది.   

డైరెక్టర్ సందీప్ రాజ్ ఈ మూవీ స్క్రిప్ట్ పైన చాలా రోజుల నుంచి వర్క్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ మూవీలో రవితేజ లెక్చరర్గా కనిపిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. అప్పట్లో మిరపకాయ్ మూవీలో సార్గా కనిపించిన మాస్ రాజా పీక్ లెవెల్లో ఎంటర్ టైన్ చేశాడు. ఇక ఈ మూవీలో రవితేజ డబల్ ఎంటర్ టైన్ మెంట్ ఇస్తాడని తెలుస్తోంది.అంతే కాకుండా విశ్వక్ సేన్ స్టూడెంట్ రోల్లో కనిపిస్తాడని సమాచారం. ఈ కాంబినేషన్ కనుక, కరెక్ట్ సెట్ అయితే థియేటర్స్లో విజిల్స్ పడటం కన్ఫర్మ్ అంటున్నారు ఫ్యాన్స్. త్వరలో మేకర్స్ ఈ మూవీకి సంబంధిన వివరాలు ప్రకటించే అవకాశం ఉంది.  

ప్రసెంట్ రవితేజ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. డైరెక్టర్ కార్తిక్ ఘట్టమనేనితో ఈగల్, గోపీచంద్ మలినేనితో మరో మూవీ చేస్తున్నారు. ఇక టైగర్ నాగేశ్వర రావు మూవీ ఈ దసరా స్పెషల్ గా 2023 oct 20 కి థియేటర్స్ లోకి రాబోతుంది. ఇక మంచు మనోజ్(Manchu Manoj) కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు. రీసెంట్గా వాట్ ది ఫిష్( What The Fish) అనే మూవీని స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే.