
ముగ్గురు తెలుగు హీరోలు నటించిన భైరవం మూవీ శుక్రవారం (మే 30న) థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమాకు ఆడియన్స్ నుంచి పాజిటివ్ రివ్యూలు వచ్చాయి. ఈ క్రమంలో భైరవం సినిమాకు ఎంత బడ్జెట్ పెట్టారు? బిజినెస్ ఎంత జరిగింది? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎలా ఉంది? మొదటిరోజు కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి? అనే పూర్తి వివరాలు చూద్దాం.
శ్రీ సత్యసాయి ఆర్ట్స్, పెన్ స్టూడియోస్ బ్యానర్లపై రూపొందిన ఈ సినిమాలో భారీగా తారాగణం, టాప్ టెక్నిషియన్స్ పనిచేశారు. ఈ సినిమాను సుమారుగా రూ.35 కోట్ల బడ్జెట్తో నిర్మించారు. టీజర్, ట్రైలర్, ప్రమోషన్స్ సినిమాకు భారీ హైప్ ఇవ్వడంతో రిలీజ్కు ముందే మంచి బిజినేసే జరుపుకుంది. దాదాపు రూ.19కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్టు సినీ వర్గల్ సమాచారం. అలా ఏరియాల వారీగా బిజినెస్ లెక్కలు గమనిస్తే..
ఏరియాల వారీగా బిజినెస్ లెక్కలు:
నైజాం థియేట్రికల్ రైట్స్: రూ.6కోట్లు
సీడెడ్లో: రూ.2.5కోట్లు
ఆంధ్రా థియేట్రికల్ రైట్స్: రూ.7.50కోట్లు
తెలుగు రాష్ట్రాల రైట్స్ సుమారుగాl: రూ.16.00కోట్లు
ఇక కర్ణాటక, ఇతర రాష్ట్రాల హక్కులు: 1.5 కోట్ల రూపాయలు
ఓవర్సీస్ హక్కులు:1.5 కోట్ల
మొత్తం వరల్డ్ వైడ్ : రూ.18.20కోట్లు (బ్రేక్ ఈవెన్ టార్గెట్-రూ.19కోట్లు)
భైరవం మూవీ బాక్సాఫీస్:
భైరవం మూవీ మొదటి రోజు (మే30) మేకర్స్ అంచనా వేసినదానికంటే తక్కువే కలెక్ట్ చేసింది. ఇండియాలో దాదాపు రూ.2.75 కోట్ల నెట్ వసూళ్లు సాధించినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. అయితే, షేర్ వసూళ్లు ఎంతనేది మేకర్స్ ఇవాళ అధికారికంగా ప్రకటించే అవకాశముంది. అయితే, ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద విజయం సాధించాలంటే.. రూ.20 కోట్ల షేర్ మరియు రూ.40 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టాల్సి ఉంటుంది.
ఇకపోతే భైరవం మూవీ ఫస్ట్ డే మొత్తం 26.70% ఆక్యుపెన్సీ నమోదు చేసింది. రోజంతా ఆక్యుపెన్సీ చాలా స్థిరంగా ఉంది. ఉదయం షోలు 25.58%, మధ్యాహ్నం షోలు 26.99%, సాయంత్రం షోలు 24.12%, మరియు రాత్రి షోలు 30.09% గరిష్ట స్థాయికి చేరుకున్నాయి.
అయితే, భైరవం సినిమాకు మహేశ్ బాబు ఖలేజా సినిమా రీ రిలీజై పోటీ ఇచ్చింది. ఈ సినిమాకు బుకింగ్స్ జోరుగా జరిగాయి. అందుకు తగ్గట్టే ఫస్ట్ డే రూ.6.5 కోట్ల గ్రాస్ వసూలు చేసిం భైరవంకి గట్టి పోటీ ఇచ్చింది. రీ-రిలీజ్ బిగ్గెస్ట్ ఓపెనింగ్ జాబితాలో రెండో స్థానానికి ఖలేజా దూసుకొచ్చింది. గబ్బర్ సింగ్ మూవీ ఫస్ట్ డే సుమారు రూ.8కోట్ల గ్రాస్ సొంతం చేసుకుని ముందంజలో ఉంది.
Khaleja Failed to beat Power Star #GabbarSingh4K .
— చీరాల 70Mm (@ALEXcrl8) May 31, 2025
Top Re-Release Day1 Gross #GabbarSingh4K - 8.1 Cr#Khaleja - 6.9 Cr(With Madam support)
Ustaad @PawanKalyan 👑 pic.twitter.com/ufK2x0gRqX