మంచు మనోజ్ చేతుల మీదుగా హారర్ కామెడీ రుక్మిణి టీజర్

మంచు మనోజ్ చేతుల మీదుగా హారర్ కామెడీ రుక్మిణి టీజర్

నిరంజన్, గ్రీష్మ నేత్రికా  జంటగా సింహాచలం గుడుపూరి  దర్శకత్వంలో   నేలబల్లి సుబ్రహ్మణ్యం రెడ్డి, కట్టా గంగాధర రావు నిర్మిస్తున్న సినిమా  ‘రుక్మిణి’.  శుక్రవారం ఈ మూవీ టీజర్‌‌‌‌‌‌‌‌ను హీరో మంచు మనోజ్ విడుదల చేసి టీమ్‌‌‌‌కు బెస్ట్ విషెస్ చెప్పాడు. 

ఈ సందర్భంగా  హీరో నిరంజన్ మాట్లాడుతూ ‘ఇదొక  హారర్ కామెడీ కథ.   ప్రేక్షకులకు డిఫరెంట్ ఎక్స్‌‌‌‌పీరియెన్స్ ఇవ్వబోతుంది’ అని అన్నాడు. తామంతా ప్యాషనేట్‌‌‌‌గా ఈ చిత్రం చేస్తున్నామని దర్శక నిర్మాతలు చెప్పారు.  ప్రియ జస్పర్ , దీప్తి శ్రీరంగం, సింహ, విఖ్యాత్, జయంత్ ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి - సుభాష్ ఆనంద్ సంగీతం అందిస్తున్నాడు.