రక్షక్​గా మంచు మనోజ్

రక్షక్​గా మంచు మనోజ్

కొంత గ్యాప్ తర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీ అయ్యాడు మంచు మనోజ్. మంగళవారం తన పుట్టినరోజు. ఈ సందర్భంగా మనోజ్ లీడ్ రోల్‌‌‌‌‌‌‌‌లో నటిస్తున్న కొత్త సినిమాను ప్రకటిస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ‘రక్షక్’ టైటిల్‌‌‌‌‌‌‌‌తో ఈ చిత్రాన్ని రూపొందించనున్నట్టు అనౌన్స్ చేశారు.   శ్రీనిధి క్రియేషన్స్ బ్యానర్‌‌‌‌‌‌‌‌పై నూతన దర్శకుడు నవీన్ కొల్లి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.  టైటిల్ పోస్టర్ చాలా ఇన్నోవేటివ్‌‌‌‌‌‌‌‌గా, ఇంటెన్స్‌‌‌‌‌‌‌‌గా ఉంది.  

మంచు మనోజ్ పవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫుల్ లుక్‌‌‌‌‌‌‌‌లో కనిపిస్తూ ఆసక్తిని పెంచేలా ఉన్నాడు.  ‘దాచిన నిజం శాశ్వతంగా దాగి ఉండదు’ అనే క్యాప్షన్ పెట్టడం మరింత క్యూరియాసిటీని  క్రియేట్ చేస్తోంది. ఇదొక గ్రిప్పింగ్  ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌‌‌‌‌‌‌‌ అని, ఇందులో మనోజ్ పవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా కనిపించనున్నాడని  మేకర్స్  తెలియజేశారు. 

ఇతర నటీనటులు, టెక్నీషియన్స్ వివరాలను త్వరలోనే ప్రకటిస్తామన్నారు. ఇక ఈ నెలాఖరులో ‘భైరవం’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. అలాగే తేజ సజ్జా  నటిస్తున్న ‘మిరాయ్’లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ మూవీ టీమ్స్ కూడా మనోజ్‌‌‌‌‌‌‌‌కు బర్త్‌‌‌‌‌‌‌‌డే విషెస్‌‌‌‌‌‌‌‌ను తెలియజేస్తూ కొత్త పోస్టర్స్‌‌‌‌‌‌‌‌ను రిలీజ్ చేశారు.