
మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కు మంచువారబ్బాయి అదిరిపోయే ట్రీట్ ఇచ్చాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. హీరో మంచు మనోజ్ టాలీవుడ్ లో ఉన్న చాలా మంది యంగ్ హీరోలతో క్లోజ్ గా ఉంటాడు. అందుకే ఆయన ఫ్రెండ్స్ లిస్ట్ కూడా ఎక్కువే. వారిలో మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ ఒకరు. వీళ్ళ ఫ్రెండ్ షిప్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
ఇందులో భాగంగా.. తాజాగా మనోజ్ తన కొత్త ఇంటిలో సాయిధరమ్ తేజ్, నరేష్ కొడుకు నవీన్ విజయ్ కృష్ణతో సహా కొంతమంది స్నేహితులతో సందడి చేశాడు. స్వయంగా బిర్యానీ వండుకొని నైట్ పార్టీని ఫుల్ ఎంజాయ్ చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలను స్వయంగా మనోజ్ తన ఇన్‌స్టా వేధికగా అభిమానులతో పంచుకున్నాడు. ఈ సందర్భంగా.. తాజాగా విరూపాక్ష మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సాయి ధరమ్ తేజ్‌కు మరోసారి అభినందనలు తెలియజేశాడు మనోజ్. లవ్ యూ బ్రదర్స్ అంటూ మనోజ్ షేర్ చేసిన ఈ ఫోటో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
ఇక సినిమాల విషయానికి వస్తే.. మనోజ్ ఇటీవలే వాట్ ది ఫిష్ అనే ఓ కొత్త సినిమాను అనౌన్స్ చేసాడు. దీనితోపాటు అహం బ్రహ్మాస్మి అనే పాన్ ఇండియా మూవీ కూడా చేస్తున్నాడు మనోజ్.