అనాథ ఆశ్రమంలో మంచు మనోజ్ సేవలు..టేబుల్స్, కుర్చీలు అందజేత

అనాథ ఆశ్రమంలో మంచు మనోజ్ సేవలు..టేబుల్స్, కుర్చీలు అందజేత
  •     మానసిక దివ్యాంగుడికి హెయిర్ కట్

ఇబ్రహీంపట్నం, వెలుగు: మతిస్థిమితం లేనివారికి సేవ చేయడం ఎంతో గొప్ప విషయమని సినీ నటుడు మంచు మనోజ్ కుమార్ అన్నారు. రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం నాదర్​గుల్​లోని ‘మాతృదేవోభవ’ అనాథ ఆశ్రమాన్ని మంగళవారం ఆయన సందర్శించారు. ఆశ్రమానికి అవసరమైన టేబుళ్లు, కుర్చీలను అందజేశారు. అక్కడ ఆశ్రయం పొందుతున్న వారికి స్వయంగా భోజనం వడ్డించారు. అలాగే ఓ మానసిక వికలాంగుడికి మనోజ్ స్వయంగా హెయిర్ కట్ చేశారు. రోడ్డు పక్కన ఎవరూ పట్టించుకోని మానసిక దివ్యాంగులను చేరదీసి నిర్వాహకుడు యాదగిరి చేస్తున్న సేవలు అభినందనీయమన్నారు. భవిష్యత్తులో తాను ఏర్పాటు చేయబోయే ఫిట్నెస్ సెంటర్ల పక్కనే ఇలాంటి వారి కోసం రిహాబిలిటేషన్ సెంటర్లను ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు.