నేను ఏం చేయగలనో ఈ రెండేళ్లలో చూపిస్తా

V6 Velugu Posted on Oct 16, 2021

‘మా’ అధ్యక్షుడిగా ఎన్నికైన తాను ఈ రెండేళ్లలో ఏం చేయగలనో చూపిస్తానని మంచు విష్ణు అన్నారు. అపోజిట్ ప్యానెల్ రిజైన్ చేసినంత మాత్రానా ఏదీ ఆగదని విష్ణు స్పష్టం చేశారు. ‘మా’ అధ్యక్షుడిగా విష్ణు ఈ రోజు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.

‘మా’ అనేది మనందరి ఫ్యామిలీ. అందుకే ‘మా’కు 24 క్రాఫ్ట్స్ మద్దతు కావాలి. ఆట ఇద్దరు ఆడితే ఎవరో ఒకరే గెలుస్తారు. అపోజిట్ ప్యానెల్ వారి సలహాలు కూడా తీసుకుంటాం. అపోజిట్ ప్యానెల్ వాళ్లు రిజైన్ చేశారు. అది చాలా దురదృష్టకరం. కానీ, షో నడవాలి.. సో ఏదీ ఆగదు.. నడుస్తూనే ఉంటుంది. ‘మా’ ఎలక్షన్ అయిపోయింది. దాని గురించి నేను కానీ, మా టీమ్ కానీ ఇప్పటినుంచి మీడియాతో మాట్లాడం. అపోజిట్ ప్యానెల్ వాళ్లు కూడా ‘మా’ ఎలక్షన్ గురించి మాట్లాడకుండా ఉంటేనే బాగుంటుంది’ అని ‘మా’ నూతన అధ్యక్షుడు విష్ణు అన్నారు.

Tagged mohanbabu, tollywood, Prakash Raj, Manchu Vishnu, Maa association, Maa Elections

Latest Videos

Subscribe Now

More News