
సీఎం కేసీఆర్ విధానాలతోనే యువకులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు MRPS వ్యవస్థాపక అధ్కక్షుడు మంద కృష్ణ మాదిగ. ఉద్యోగం లేక నాగార్జున సాగర్ హిల్ కాలనీలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ప్రైవేట్ టీచర్ రవికి ఆయన నివాళులర్పించారు. ఏడేళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క డీఎస్సీ కూడా వేయలేదన్నారు మంద కృష్ణ. పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో ఆత్మహత్యలు జరగడం బాధాకరమని తెలిపారు. బీసీలు, దళితులు త్యాగాలు చేస్తే, కేసీఆర్ కుటుంబం పదవులు అనుభవిస్తోందని ఫైర్ అయ్యారు.