
ఓయూ, వెలుగు: ఎస్సీ రిజర్వేషన్ అయిపోయిందని ఎమ్మార్పీఎస్ ఫౌండర్ మంద కృష్ణమాదిగ వ్యాఖ్యానించడం తగదని, దీనివల్ల 58 ఉప కులాలు నష్టపోతున్నాయని మాల సంఘాల జేఏసీ, మాల స్టూడెంట్ జేఏసీ నాయకులు మండిపడ్డారు. బుధవారం ఓయూ ఆర్ట్స్ కాలేజీ వద్ద నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా మాల సంఘాల జేఏసీ చైర్మన్ మందాల భాస్కర్, మాల స్టూడెంట్ జేఏసీ చైర్మన్ రాహుల్ రావు మాట్లాడుతూ.. మంత్రి వివేక్ వెంకటస్వామిపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కామెంట్లు చేయడం సమంజసం కాదన్నారు. భేషజాలు వదిలి వివేక్ తో కలిసి దళిత అభ్యున్నతికి తోడ్పాటునందించాలని అడ్లూరికి విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో మాల సంఘాల జేఏసీ గౌరవ అధ్యక్షుడు చెరుకు రామచందర్, గ్రేటర్ హైదరాబాద్ చైర్మన్ బేర బాలకిషన్, మాస శేఖర్, నామ సైదులు, అంజిబాబు, కొప్పుల అర్జున్, ఎలుకల నర్సింగ్ పాల్గొన్నారు.