కోల్బెల్ట్, వెలుగు: కెనడాలోని టొరోంటోలో ఈనెల 4,5,6 తేదీల్లో నిర్వహించిన ఇంటర్నేషనల్మార్షల్ఆర్ట్స్ ఛాంపియన్షిప్లో మంచిర్యాల జిల్లా మందమర్రి టౌన్ కు చెందిన అంతర్జాతీయ క్రీడాకారుడు పఠాన్జమీల్ఖాన్ గోల్డ్మెడల్సాధించారు. ఇండియా తరఫున జమీల్ఖాన్ ఒక్కరే 50 ఏండ్ల విభాగంలో పోటీ పడ్డారు.
ఈ టోర్నమెంట్లో ప్రపంచవ్యాప్తంగా 30 దేశాల నుంచి 2 వేల మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జమీల్ఖాన్ మాట్లాడుతూ... ప్రభుత్వం మరింత సహకరిస్తే ప్రపంచవేదికపై ఇండియాతో పాటు తెలంగాణ పేరును నిలబెట్టేలా ప్రతిభ చూపుతానని పేర్కొన్నారు. తన విజయానికి తోడ్పడ్డవారికి థ్యాంక్స్ చెప్పారు. కాగా.. జమీల్ఖాన్30ఏండ్లుగా అనేక జాతీయ,అంతర్జాతీయ పోటీల్లో పతకాలు సాధించారు.

