చెన్నూరులో డబ్బులు పంచుతూ దొరికిన బీఆర్ఎస్ కార్యకర్తలు

చెన్నూరులో డబ్బులు పంచుతూ దొరికిన బీఆర్ఎస్ కార్యకర్తలు

తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం ముగియగానే అసలు ఆట మొదలైంది. అదే ఓటర్లను తమ వైపు తిప్పుకోవడానికి పార్టీల ప్రలోభాలు. ఈ క్రమంలో ఓటర్లకు డబ్బులు పంచుతూ కొందరు పట్టుపడగా.. మరికొంత మంది నగదును అక్రమంగా తరలిస్తూ పోలీసుల తనిఖీల్లో దొరిపోతున్నారు. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో ఓటర్లకు డబ్బులు పంచుతున్నారనే ఫిర్యాదులు అందుతున్నాయి.

మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలోని మందమర్రిలో అధికార పార్టీ నాయకులు ఓటర్లకు డబ్బులు పంచి పెడుతున్నారు. మందమర్రి బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు జయ రవీందర్ ఆధ్వర్యంలో డబ్బుల పంపిణీ జరుగుతుండగా.. ఆపడానికి వెళ్లిన శ్రావణ్ అనే వ్యక్తిపై.. బాల్క సుమన్ అనుచరులు దాడి చేసే ప్రయత్నం చేశారు. బస్తీ వాసులను ఉసిగొల్పి.. శ్రావణ్ పై దాడి చేయించే ప్రయత్నం చేశారు. విషయం తెలియగానే వెంటనే శ్రావణ్ ను బ్లూ కోట్ పోలీస్ రక్షించాడు. 

రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల్లో తదుపరి ఘట్టమైన పోల్ మెనేజ్మెంట్ షూరు అయ్యింది. గ్రామాలు, పట్టణాల్లో ఓటర్లను డబ్బు, మద్యం, ఇతర తాయిలాలతో ప్రలోభ పెట్టే కార్యక్రమం జరుగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా జోరుగా మద్యం, నగదు పంపిణీ జరుగుతున్నట్లు తెలుస్తోంది. పోటాపోటీగా నాయకులు ఓటర్లకు డబ్బు, మద్యం పంపిణీ చేస్తున్నట్లు సమాచారం. ఈసారి ఎన్నికల్లో మద్యం, నగదు ప్రవాహానికి అడ్డుకట్ట వేయడానికి ఈసీ ఎంత ప్రయత్నం చేసినా.. నియోజకవర్గాల్లో మాత్రం కొత్త కొత్త దారుల్లో పోల్ మేనెజ్మేంట్ మొదలైయినట్లు టాక్ వినిపిస్తోంది. 

Also Read:- పాడి కౌశిక్‌రెడ్డిపై కేసు నమోదు