వరదకు కొట్టుకుపోయిన చెక్ డ్యాం రిటైనింగ్ వాల్

వరదకు కొట్టుకుపోయిన చెక్ డ్యాం రిటైనింగ్ వాల్

మానేరు రివర్ ఫ్రంట్ లో భాగంగా కరీంనగర్  తీగల వంతెన దిగువన నిర్మించిన చెక్ డ్యాం రిటైనింగ్ వాల్ వరద ఉధృతికి కొట్టుకుపోయింది. దీంతో దాదాపు 30 లక్షలకు పైగా నష్టం జరిగింది.  కరీంనగర్  నుంచి మానకొండూర్  మండలం వేగురుపల్లి వరకు నీరు నిల్వ ఉండేలా.. దాదాపు 12 కోట్ల వ్యయంతో చెక్ డ్యాం నిర్మాణం చేపట్టారు. చెక్ డ్యాం తో పాటు.. నీళ్లు సైడుకు వెళ్లకుండా రిటైనింగ్ వాల్ కడుతున్నారు. LMD నుంచి నీళ్లు విడుదల చేయడంతో వరదకు..ఆ రిటైనింగ్ వాల్ ముక్కలు ముక్కలుగా విరిగిపోయి నీటి ప్రవాహంలో కొట్టుకుపోయింది. తాము ఈ గోడను లక్షా 70 వేల క్యూసెక్కులకు డిజైన్ చేసి నిర్మించామని.. ఊహించని విధంగా వరద వచ్చి కొట్టుకుపోయిందని చెబుతున్నారు అధికారులు.