వందేళ్లు అలరించేలా మానేరు రివర్ ఫ్రంట్

 వందేళ్లు అలరించేలా మానేరు రివర్ ఫ్రంట్

కరీంనగర్, వెలుగు: అత్యాధునిక హంగులతో వందేళ్లపాటు అలరించేలా మానేరు రివర్ ఫ్రంట్ ను డెవలప్​ చేస్తామని బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. గురువారం కేబుల్ బ్రిడ్జిపై 6.5 కోట్లతో ఏర్పాటు చేయనున్న డైనమిక్ లైటింగ్ సిస్టం పనులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కేబుల్ బ్రిడ్జిని మరింత అందంగా తీర్చిదిద్దేందుకు రూ.6.5 కోట్లతో డైనమిక్ లైటింగ్ సిస్టంను ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు. 

అల్గునూర్ బ్రిడ్జిపై నిలబడి చూసినా స్పష్టంగా కనిపించేలా జర్మన్ టెక్నాలజీతో 45 వేల పిక్సల్స్​ గల 10x30 సైజులో మానేరు వంతెనకు ఇరువైపులా 4 టీవీలను ఏర్పాటు చేస్తున్నామని, జూన్ 2న లేదా లేదా ఆగస్టు15న ప్రారంభిస్తామని చెప్పారు. ప్రపంచంలో మూడో అతిపెద్ద ఫౌంటెన్ పనులకు రూ.60 కోట్లు మంజూరయ్యాయని, మూడునాలుగు రోజుల్లో పనులు ప్రారంభిస్తామని మంత్రి వివరించారు. కార్యక్రమంలో కలెక్టర్ ఆర్.వి. కర్ణన్, ఎమ్మెల్యే బాలకిషన్, మేయర్ సునీల్ రావు, డిప్యూటీ మేయర్ చల్లా స్వరూపరాణి, కరీంనగర్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అనిల్ కుమార్, ఆర్డీఓ ఆనంద్ కుమార్, కొత్తపల్లి మున్సిపల్ చైర్మన్ రుద్రరాజు తదితరులు పాల్గొన్నారు.