ఎమ్మెల్యే రాజాసింగ్ పై ఆయుధాల కేసు

ఎమ్మెల్యే రాజాసింగ్ పై ఆయుధాల కేసు

గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే  రాజాసింగ్ పై కేసు నమోదైంది.   మంగళ్ హాట్ పోలీసులు ఆయనకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు.  ఈ ఏడాది దసరా రోజున ఆయుధ పూజ సందర్భంగా కత్తులు, ఆయుధాలను బహిరంగంగా ప్రదర్శించడంతో రాజాసింగ్ కు షో-కాజ్ నోటీసులు పంపారు  పోలీసులు.  విద్వేష ప్రసంగానికి సంబంధించి రెండు విచారణా నోటీసులు ఆయనకు జారీ చేశారు.   మూడు రోజుల్లో షోకాజ్ నోటీసులపై వివరణ ఇవ్వాలని పోలీసులు పేర్కొన్నారు.  

తుపాకులు, కత్తులు పెట్టుకుని రాజా సింగ్ పూజలు చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.   ఈ వీడియోపై స్థానిక లీడర్ ఎంఏ సమద్ వార్సీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు  పోలీసులు ఐపీసీ 153ఏ, 295ఏ, 504 సెక్షన్ల కింద రాజాసింగ్ పై కేసు నమోదు చేశారు పోలీసులు.  

కేసు బుక్ అయిన తర్వాత ఒకటి, రెండు రోజుల్లో ప్రతివాదికి నోటీసులు జారీ చెయ్యాలి కానీ..  మంగళ్‌హాట్ పోలీస్ స్టేషన్‌లో రాజాసింగ్ పై ఎఫ్‌ఐఆర్ బుక్ చేసి 16 రోజులు అయ్యింది.. ఇప్పుడు ఆయనకు  నోటీసులు ఇవ్వడం పోలీసులు తీరుపై చర్చనీయాంశంగా మారింది.