చలితో మామిడి రైతులు అప్రమత్తంగా ఉండాలి : చక్రపాణి

చలితో మామిడి రైతులు అప్రమత్తంగా ఉండాలి : చక్రపాణి
  •     వికారాబాద్ జిల్లా ఉద్యానవన  శాఖ అధికారి చక్రపాణి
     

వికారాబాద్, వెలుగు :  చలికాలం కావడంతో వాతావరణంలో తేమ శాతం ఎక్కువ ఉందని మామిడి రైతులు సస్యరక్షణ చర్యల్లో అప్రమత్తంగా ఉండాలని వికారాబాద్ జిల్లా ఉద్యానవన శాఖ అధికారి చక్రపాణి సూచించారు. జిల్లాలో మామిడి పంటకు భూములు అనుకూలంగా ఉన్నాయని, నాణ్యమైన పంట పండించేందుకు పాటించాల్సిన సూచనలు ఇచ్చేందుకు క్షేత్రస్థాయిలో సందర్శిస్తూ  రైతులకు పలు సూచనలు ఇస్తున్నట్టు ఆదివారం ఆయన ఒక ప్రకటనలో వెల్లడించారు.  

జిల్లాలో 15,000 ఎకరాల్లో మామిడి సాగు చేసినట్టు, ఇందులో భాగంగా పూడూరు మండలంలో మామిడి తోటలను పరిశీలించి రైతులకు పలు సూచనలు చేశామని చెప్పారు. ప్రస్తుతం మామిడి తోటలు సగభాగం పచ్చ పూత, ఇంకొంత భాగం తెల్ల పూత, కొంత భాగం ఇంకా మొట్టెలతోటి (మొగ్గ దశలో) పూత విచ్చుకోకుండా ఉందని, ఇలాంటి పరిస్థితుల్లో తేలికపాటి నీటి తడులు ఇవ్వాలని సూచించారు. ఉద్యాన అధికారులు వైజయంతి, అర్చన, అబ్దుల్ గఫూర్ తదితరులు ఉన్నారు.