భారీ వర్షాలకు సిటీలో తెరుచుకున్న మ్యాన్ హోల్స్

భారీ వర్షాలకు సిటీలో తెరుచుకున్న మ్యాన్ హోల్స్

హైదరాబాద్ లో గంట సేపు వర్షం దొంచికొట్టింది. భారీగా కురిసిన వర్షానికి రోడ్లపైకి వరద నీరు చేరటంతో జనం ఇబ్బందులు పడుతున్నారు. డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి. సికింద్రాబాద్, కంటోన్మెంట్, బంజారాహిల్స్, పంజాగుట్ట, అమీర్ పేట్  ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. భారీ వర్షంతో రోడ్లపై భారీగా వరద నీరు చేరుకుంది. దీంతో వాహనాల రాకపోకలకు ఇబ్బంది ఎదురైతుంది. పంజాగుట్ట, అమీర్ పేట్ ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.  

కొన్ని చోట్ల మ్యాన్ హోల్స్ ప్రమాదకరంగా మారాయి. సికింద్రాబాద్ లోని ప్యాట్నీ వద్ద ఓ మ్యాన్ హోల్ తెరుచుకోవడంతో వరద నీరు బయటకు వస్తుంది.  మ్యాన్ హోల్స్ తెరవడంతో ప్రయాణికులకు ప్రమాదకరంగా మారింది. వరదలో మ్యాన్ హోల్స్ కనిపించకపోవడంతో ప్రమాదం జరిగే అవకాశం ఉందని..వెంటనే అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.హైదరాబాద్ లో అత్యధికంగా మల్కాజిగిరి జిల్లా ప్రశాంత్ నగర్ లో 7.3సె.మీ, వెస్టెమారేడ్ పల్లిలో 6.6 సెంటీమీటర్ల వర్షపాతం కురిసింది. మెట్టుగూడలో 4.6 సెంటీమీటర్లు, అంబర్ పేట్ లోని బతుకమ్మ కుంటలో 3.5సెంటీమీటర్ల వర్షం కురిసింది. రాజేంద్రనగర్ లో 2.8, కూకట్ పల్లిలోని బాలనగర్ లో 2.7, ఉప్పల్ లోని రామంతపూర్ లో2.2, జూబ్లీహిల్స్ లోని సింగరేణి కాలనీలో 2సెంటీమీటర్ల వర్షం కురిసింది.  ఖైరతాబాద్, మలక్ పేట్, ఎల్ బీ నగర్ ప్రాంతాల్లో తేలికపాటి వర్షం పడింది.